Rajendra Prasad Pakala lawsuit for Rs 160 crore: హైదరాబాద్: తనపై దుష్ప్రచారం చేశారంటూ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల నోటీసులు పంపించారు. ఫిబ్రవరి నెలలో రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ కేసు (Radisson Hotel Drugs Case)లో తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రాజేంద్రప్రసాద్ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు  పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన 10 కోట్ల దావా కింద.. మొత్తంగా రూ.160 కోట్లకు దావా వేశారు. 


రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ వ్యవహారంలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థలు అనవసర వార్తలు రాశాయని ఆరోపిస్తూ  లీగల్ నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా.. తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్ చేసిన వార్తలు, వీడియోలను డిలీట్ చేయాలని నోటీసులలో పేర్కొన్నారు. తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ వార్తలు, వీడియో కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

మీడియా సంస్థలకు రాజేంద్రప్రసాద్ నోటీసులు