Today Top Headlines In AP And Telangana: 


1. టీటీడీకి సీఎం చంద్రబాబు కీలక సూచనలు


తిరుమలలో వీఐపీ సంస్కతి తగ్గాలని సీఎం చంద్రబాబు టీటీడీని అదేశించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడే పరిసరాలు ఉండాలి తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని సూచించారు. తిరమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇంకా చదవండి.


2. పండుగ పూట వినియోగదారులకు బిగ్ షాక్


టమాటా ధరలు ఒక్కసారిగా సెంచరీ కొట్టేస్తోంది. ఎక్కడ చూసీన 80 రూపాయ కంటే తక్కువకు కిలో టమాటా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు 50రూపాయల్లోపు ధర పలికే టమాటా ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. కొనేందుకు వెళ్తున్న వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉన్న వాటినోత సరిపెట్టుకుంటున్నారు. అసలే పండగ సీజన్ ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలని వాపోతున్నారు. టమాటా లేనిదే దాదాపు ఎవరింట్లో కూడా వంట పూర్తి కాదు. వెజ్‌ ఆర్‌ నాన్‌వెజ్ ఏం వండినా టమాటా ఉంటే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. ఇంకా చదవండి.


3. దసరాకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


దసరా, దీపావళి మొదలు ఇకపై అన్నీ పండగ రోజలే. పండగలు వచ్చాయంటే ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచనలో తూర్పుగోదావరిజిల్లా ప్రజలు ఉంటారు. అక్కడ ఆతిథ్యం, ఇతర అహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు మిగతా ప్రాంత ప్రజలు వెళ్తుంటారు. దీంతో పండగ సీజన్ వచ్చిందంటే చాలు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలాంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా తూర్పుగోదావరి డిపో నుంచి ప్రత్యేక బస్‌లు నడుపుతోంది. ఇంకా చదవండి.


4. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంది. ఇటీవల వచ్చిన  వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో వరదలు భారీ నష్టానికి కారణం అయ్యాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలన జరిపింది.   భారీ వర్షాల వల్ల రూ. 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకా చదవండి.


5. నటుడు నాగార్జునకు బిగ్ షాక్


ఎన్ కన్వెన్షన్ యజమాని , నటుడు నాగార్జునకు వరుసగా కష్టాలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూలో తమ కుటుంబాన్ని ప్రస్తావించి విమర్శలు చేశారని ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న దశలో నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు అయింది. చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థకు చెందిన  కసిరెడ్డి  భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని భాస్కర్ రెడ్డి తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా చదవండి.