Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్ను తనకి DNA  టెస్ట్ ఎందుకని ప్రశ్నిస్తాడు. తాను మిత్ర కొడుకే అని దానికి డాక్టర్ సర్టిఫికేట్స్ అవసరం లేదని అంటాడు. జున్ను మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. నీ ప్రశ్నలన్నీ మిత్రకు అడగాలని అంటుంది. మాట్లాడాల్సిన వ్యక్తి సైలెంట్‌గా ఉన్నారని అంటుంది. మనీషా మాత్రం తల్లీకొడుకులు బాగానే నాటకాలు ఆడుతున్నారని అంటుంది.


జున్ను: మీరే మా అమ్మానాన్నల్ని విడదీయాలనుకుంటున్నారు. మా నాన్నని పెళ్లి చేసుకొని మా అమ్మ స్థానంలోకి రావాలి అనుకుంటున్నారు.
దేవయాని: మీ నాన్నే నిన్ను మీ అమ్మని వద్దు అనుకుంటున్నాడు. మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అర్థమైందా.
జున్ను: ఆ మాట మా నాన్న చెప్పాలి మీరు ఎందుకు చెప్తున్నారు. నాన్న ఆ విషయం నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను తన కొడుకు కాదు అని నాన్న ఒక్కసారి కూడా అనలేదు. నా ప్రోగ్రస్ కార్డు మీద కూడా నాన్న సంతకం పెట్టారు. నేను తన కొడుకు కాదు అని నాన్న చెప్పాలి. టెస్ట్ చేయించుకోమని నాన్న చెప్పాలి. అలా నాన్న చెప్పినప్పుడే నేను ఆ టెస్ట్ చేయించుకుంటా. 
అరవింద: షబాష్ జున్ను చెప్పాల్సిన మాట చెప్పుతో కొట్టినట్లు చెప్పావ్ ఆ మాట మీదే ఉండు.
జయదేవ్: రేయ్ జున్ను మీ అమ్మ సైలెంట్‌గా ఉన్న నీలోని నందన్ రక్తం సై అంటుందిరా.
అరవింద: ఇప్పుడు ఎవరితో చెప్పిస్తారో చెప్పండి.
జయదేవ్: ఎవరు సమాధానం చెప్తావో చెప్పండి. 


మిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వివేక్ తల్లితో హోటల్‌ విషయం తనకు తెలుసని అంటాడు. దేవయాని షాక్ అయి తడబడుతుంది. నాకు తెలీకుండా ఏం చేస్తున్నారని దేవయాని అంటే నీకు తెలీకుండా ఏం జరగదు కానీ నీకు చెప్పకుండా ఏం చేయను అని ఏం జరుగుతుందో చూడు అని అంటాడు. దాంతో ఏదో జరగబోతుందని ఆలోచనలో పడుతుంది. మరోవైపు మిత్ర జున్ను మాటల్ని తలచుకొని బాధపడుతుంటాడు. మనీషా మిత్ర దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకోమని చెప్పు వాళ్లని ఇంటి నుంచి తరిమేద్దామని పిలుస్తుంది. దాంతో మిత్ర మనీషా మీద అరుస్తాడు. ఆ జున్ను నందన్ వంశ వారసుడే అని అంటాడు. మనీషా షాక్ అయిపోతుంది. జున్ను ఆ మాట వింటాడు.


మిత్ర: వాడి మాటలు వింటుంటే నీకు అనిపించడం లేదా వాడు ఈ ఇంటి వారసుడే అని. వాడి ప్రవర్తన, కోపం చూస్తుంటే నీకు అనిపించడం లేదా వాడు నా కొడుకే అని. ఎస్ జున్ను నా కొడుకే. నందన్ వంశ వారసుడే. అందులో ఎలాంటి అనుమానం లేదు.
మనీషా: టెస్ట్ చేయకుండా అలా ఎలా చెప్తావ్ మిత్ర.
మిత్ర: గొడవ నాకు లక్ష్మీకి జున్నుతో కాదు. లక్ష్మీ తప్పు చేసుండొచ్చు కానీ జున్ను చేయలేదు.
మనీషా: అంటే ఆ జున్ను నీ కొడుకు అని అంగీకరిస్తున్నావా,,
మిత్ర: అదే కదా చెప్తున్నా వాడి మాటల్లో నేను వినిపిస్తున్నాడు. నడవడికలో నేను కనిపిస్తున్నాను. వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది దీని కంటే ఇంకే కావాలి. నేను నిన్ను ప్రేమించాను లక్ష్మీని పెళ్లి చేసుకున్నాను ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. బాధ్యతకి బంధానికి మధ్య నలిగిపోతున్నాను. ఇంతటితో ఇది ఆపేయ్ 
మనీషా: ఆపేయ్ మంది మన పెళ్లినా నా ఊపిరినా.
మిత్ర: నాకు కొంచెం స్పేస్ కావాలి.


జున్ను ఫీలవుతుంటే లక్కీ ఓదార్చుతుంది. లక్ష్మీ కూడా అక్కడికి వచ్చి జున్నుని ఓదార్చుతుంది. దాంతో జున్ను లక్ష్మీకి సారీ చెప్తాడు. నా వల్లే నీకు ఇన్ని కష్టాలని అంటాడు. జున్ను మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. అరవింద, జయదేవ్ కూడా లక్ష్మీని ఓదార్చుతారు. మంచి కొడుకు నీకు పుట్టాడని అంటారు. అమ్మకి నేను జున్ను సపోర్ట్‌గా ఉంటామని అంటుంది. సంజన అందరి కోసం కొత్త బట్టలు తీసుకొని వస్తుంది. ఇప్పుడేంటి అని అందరూ అడుగుతారు. చాలా పెద్ద విశేషం ఉందని సంజన చెప్తుంది. రేపు గుడిలో పూజ ఉందని మీరంతా తప్ప కుండా రావాలి అని అంటుంది. జానుకి నీకు ఇష్టమైన పట్టుచీర ఉందని అదే నువ్వు కట్టుకొని రావాలని అంటుంది. అందరినీ పేరు పేరున రమ్మని పిలుస్తుంది. నీ హడావుడి చూస్తే ఏదో పెళ్లిలా ఉందని మనీషా అంటుంది. దాంతో సంజన పూజ, పెళ్లి రెండూ మంచివే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జుట్టు పీక్కొని రాక్షసుడిలా మారిపోయిన శ్రీధర్.. దీప, కార్తీక్‌ల ఫ్యామిలీ ఫొటో చూసేసిన జ్యోత్స్న!