Karthika Deepam 2 Serial October 5th: కార్తీకదీపం 2 సీరియల్: జుట్టు పీక్కొని రాక్షసుడిలా మారిపోయిన శ్రీధర్.. దీప, కార్తీక్‌ల ఫ్యామిలీ ఫొటో చూసేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Episode కాశీ కార్తీక్, దీపలతో ఫోటో తీసుకొని అది కాశీ పారిజాతానికి పంపించడం జ్యోత్స్న కూడా చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial October 1st Episode స్వప్న తండ్రిని ఇంట్లోకి రావొద్దని చెప్పడంతో కావేరి, శ్రీధర్ ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఇక కాంచన వాళ్లు కూడా వెళ్లిపోతామని అంటే భోజనం చేయమని అంటారు. అందరూ కలిసి సెల్పీ తీసుకుంటారు. కాశీ పక్కన స్వప్న నిల్చొంటే దీప కార్తీక్ పక్కన నిల్చొంటుంది. మళ్లీ వస్తామని చెప్పి కార్తీక్  వాళ్లు వెళ్లిపోతారు. ఇక దాసు వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంటికి ఎవరూ రారు అని నన్ను తిట్టిన నానమ్మకి ఎవరు వచ్చారో తెలియాలి అని పారిజాతం కుళ్లు కోవాలని అని కాశీ సెల్ఫీ పారిజాతానికి పంపిస్తాడు.  పారిజాతం ఫొటో చూసి షాక్ అయిపోతుంది.

Continues below advertisement

పారిజాతం: ఏంట్రా మీరు ఎంతకు తెగించారురా. ఇలాంటి ఫొటో చూసి నా గుండె ఆగిపోకుండా ఉంది అంటే నాది గట్టి గుండె.  
జ్యోత్స్న: చూస్తే గుండె ఆగిపోయేలా ఏముంది ఆ ఫోటోలో.
పారిజాతం: దీనికి చూపించకూడదు. ఏమీలేదు

ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. పారు ఇవ్వకపోయినా బలవంతంగా లాక్కోని జ్యోత్స్న ఫొటో చూస్తుంది. కోపంతో ఇదంతా ఎప్పుడు జరిగిందని అంటుంది. ఇప్పుడే అని చెప్తుంది పారు చెప్తుంది. మీ బావని గుప్పెట్లో పెట్టుకున్న దీప ఎలా ఆడిస్తే అలా మీ అత్త, బావ ఆడుతున్నారన్నమాట అని పారు అంటుంది. ఇక ఆ దీపని వదల కూడదని పారిజాతం అంటుంది. ఇదంతా నేనే తేల్చుకుంటానని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక శ్రీధర్ స్వప్న మాటలు తలచుకొని ఆలోచిస్తుంటాడు. కోపంతో మందు గ్లాస్ పడేస్తాడు. నా పిల్లలు కూడా నాకు నీతులు చెప్తున్నారని నాకు గౌరవం లేదని అరుస్తాడు. దాంతో కావేరి అక్కడికి వస్తుంది. 

కావేరి శ్రీధర్‌తో అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకురావాలని అంటుంది. దాంతో శ్రీధర్ నేను ఆ పనోడి కొడుకుని ఇంటి తీసుకురావాలా అది అస్సలు జరగదని అంటుంది. అల్లుడిని అమ్మాయిని ఇంటికి తీసుకురావాలని కావేరి అంటే అందరూ నన్ను చంపేయండి అని అంటాడు. దానికి కావేరి మీ మొదటి భార్యకి అన్యాయం జరిగింది అని నేను నా కూతురిని దూరం చేసుకుంటానా అని అంటుంది. బాధలో ఉన్న నన్ను ఓదార్చుకుండా తండూరి చికెన్లా వేసుకొని తినొద్దని అంటాడు. కావేరి మాటలకు దీప చేష్టలకు శ్రీధర్ దీప అని జుట్టు పీక్కొని అరుస్తాడు. ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదని అనుకుంటాడు.  

దీపని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని కార్తీక్‌తో కాంచన చెప్తుంది. స్వప్న ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్ అని దీప అంటుంది. సంబంధం అక్రమం కానీ బిడ్డలు కాదు అని అనడం చాలా గొప్పమాట అని అంటుంది. కాశీ, స్వప్నలకు మీరు అండగా ఉండటం చాలా సంతోషంగా ఉన్నారని అంటుంది. నీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయని అప్పుడప్పుడు వస్తూ ఉండు అని కాంచన దీపతో చెప్తుంది. ఇక దీప కార్తీక్‌తో మీరు జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని మీ మీదే ఆశలు పెట్టుకున్న జ్యోత్స్న జీవితాన్ని పెళ్లి చేసుకోండని అంటుంది. ఇక కార్తీక్ కూడా తన తల్లికి పుట్టింటిని కానుక ఇస్తానని అంటాడు. ఇక కార్తీక్, దీపలు ఇంటికి బయల్దేరుతారు.

శౌర్య ఇంటి ముందు సైకిల్ తొక్కుతుంటే నర్శింహ ముసుగు వేసుకొని వస్తాడు. శౌర్యని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకు రిమోట్ కార్‌ని శౌర్యకి ఎరగా వేస్తాడు. పాప ఆ రిమోట్ కార్‌ని చూసి దాని వెంట గేటు దాటి బయటకు వస్తుంది. ఇంతలో కార్తీక్, దీపలు వచ్చేస్తారు. నర్శింహ వెనక్కి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: లలితాదేవికి గన్ గురిపెట్టిన తిలోత్తమ.. గాయత్రీ పాప జోగయ్య శాస్త్రి గారి మనవరాలు కాదన్న లలితాదేవి!

Continues below advertisement
Sponsored Links by Taboola