ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ( BJP Leader ) ఇంటి నుంచి కిడ్నాప్ గురైన నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిసింది. అయితే వారు కిడ్నాప్‌కు ( Kidnap ) గురి కాలేదని తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తేలింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే జితేందర్ రెడ్డి నివాసం నుంచి ఆయన డ్రైవర్ థాపా సహా నలుగుర్ని బలవంతంగా తీసుకెళ్లడం సంచలనం అయింది. సీసీటీవీ ఫుటేజీలతో ( CCTV footage ) సహా జితేందర్ రెడ్డి సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చేసిన విచారణలో తెలంగాణ పోలీసులు వారిని తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. 


తెలంగాణ పోలీసులు జితేందర్ రెడ్డి ఇంటి నుంచి తీసుకెళ్లిన నలుగురిలో ముగ్గురిపై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ( Pet Bashirabad ) కేసులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ స్టేషన్ పోలీసులే ఢిల్లీకి వచ్చి ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను ఎందుకు అరెస్ట్ చేశారో స్పష్టత లేదు. అందుకే తెలంగాణ పోలీసులు పొరపాటున థాపాను ( Driver THapa ) తీసుకు వచ్చామని విమరణ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయనను వదిలేశామని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


మరో వైపు తెలంగాణ పోలీసులు ( Telangana Police )  కిడ్నాపర్లుగా మారారాని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. దేశ రాజధానికి వెళ్లి ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే... అక్కడి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు. అలా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఈ అంశంలో ఎవరు నిబంధనలు ఉల్లంఘించారో వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతామంటున్నారు. జితేందర్ రెడ్డి ఇంటి నుంచి అపహరించిన వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎన్నికలసంఘానికి ఫిర్యాదు  చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) ఎన్నికల అఫిడవిట్ ట్యాంపర్ చేశారని వారు ఈసీకి ఫిర్యాదు చేశారు.


ప్రస్తుతానికి ఈ అంశం విచారణలో ఉంది. ఆయన ట్యాంపరింగ్ నిజమేనని ఈసీ నిర్ధారించిందని ఆయనపై అనర్హతా వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ ఫిర్యాదులు చేసిన వారిని ఢిల్లీకి వెళ్లి మరీ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారేమీ పరారీలో లేరని నోటీసులు ఇచ్చినా పోలీసుల ముందు హాజరై ఉండేవారని అంటున్నారు. మొత్తంగా ఢిల్లీలోని జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగింది కిడ్నాప్ కాదని అరెస్టులని తేలింది.