దేశ ఆర్థిక వృద్ధిలో టాప్‌ లిస్ట్‌లో నిలిచిన తెలంగాణ సోషల్‌ మీడియాలో కూడా దుమ్ము రేపింది. #TriumphantTelangana, #ThankYouKCR హ్యాష్ ట్యాగ్‌లు టాప్‌ట్రెండింగ్‌లో నిలిచాయి. తెలంగాణ సాధించిన ప్రగతి వివరిస్తూ ఉదయం కేటీఆర్‌ ఓ ట్వీట్ చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు రీట్వీట్స్‌ చేశారు. 






బుధవారం సోషల్ మీడియాలో తెలంగాణ నినాదం హోరెత్తింది. దేశంలోనే ఆర్ధిక వృధ్దిరేటులో తెలంగాణ మొదటిస్థానం సాధించడంతో నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు. ప్రభుత్వం షేర్ చేసిన డాక్యుమెంట్స్, పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు. 


రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్ల కాలంలోనే ఇంతటి ప్రగతి సాధించామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి చాలా అపోహలు ఉండేవని వాటిని కాదని ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 






కేవలం ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించి దేశానికే దిక్సూచిగా నిలబడిందని కామెంట్స్ చేస్తున్నారు టీఆర్‌ఎస్ లీడర్లు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యాత్‌  ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 


మొత్తం మీద 50 వేలకుపైగా ట్వీట్లతో ట్విట్టర్లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తింది.కోట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని కామెంట్ చేస్తున్నారు. 






కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి ఎలాంటి సహాయం లేకపోయినా సొంతగా అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్ మంత్రులు  అభిప్రాయపడుతున్నారు.