Green Signal To Sharmila Padayatra : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దు అని హైకోర్టు సూచించింది. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని సూచిస్తూ, పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని ఆ పిటిషన్ లో వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ షర్మిల తన పాదయాత్రలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుందని అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు. దీంతో షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్రకు మరోసారి ధరఖాస్తు చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద పాదయాత్రపై దుండగులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా షర్మిల పాదయాత్రను నిలిపివేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో వదిలి పెట్టారు. పాదయాత్రకు అన్ని అనుమతులు ఉన్నాయని.. అయినా పోలీసులు అరెస్ట్ చేశారని హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
మరో వైపు పాదయాత్రలో తనపై జరిగిన దాడులకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారి తీసింది.ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిల తో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ ల నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని షర్మిల పై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ తో ఎస్సార్ నగర్ పీఎస్ వద్దకు ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
,పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో షర్మిల ఎక్కడ పాదయాత్ర ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. . అయితే మళ్లీ పాదయాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుందన్నదానిపై వైఎస్ఆర్‌టీపీ వర్గాలు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకూ మూడున్నర వేల కిలోమీటర్ల వరకూ నడిచారు. షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా.. కొన్ని చోట్ల పాదయాత్రలో పాల్గొని తమ కుమార్తెకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!