గ్రామీణాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఒక కొత్త శకానికి నాంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ రాష్ట్రాలలో అభివృద్ధి మోడల్ గా తెలంగాణ ఉందన్నారు. 96.74% తో దేశంలో  తెలంగాణ నెం.1 గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండో స్థానంలో తమిళనాడు (35.39%) భారీ తేడాతో ఉండటాన్ని కూడా కేటీఆర్ ఉంటంకించారు. అయితే పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందిగా అమలు చేస్తున్నారని, ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న కృషిని ప్రశంసలు కురిపించారు. అలాగే స్వచ్ఛ తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ గైడెన్స్ లో తమ శాఖ మంచి ప్రగతిని సాధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి రీ ట్వీట్ చేశారు. 






Also Read: కోర్టులో బండి సంజయ్‌కు షాక్.. బెయిల్ తిరస్కరణ, కరీంనగర్ జైలుకు బీజేపీ చీఫ్


రాష్ట్రంలో 13,737 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్


తెలంగాణలో 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలను అంటే 96.74 శాతం ఓడీఎఫ్‌(ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) ప్లస్‌గా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కల్పించిన వసతులు, మౌలిక సదుపాయాలతో తెలంగాణ పల్లెలు దేశంలో అగ్రగామిగా ఉన్నాయి. ఇటీవల ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌గా నిలిచాయని పంచాయతీరాజ్ అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం 5,82,903 గ్రామాలుంటే 26,138 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్‌ ప్లస్‌ పరిధిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో తెలంగాణ గ్రామాలు 13,737 (52శాతం) ఉన్నాయి. 


Also Read: రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి... అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు... ఎంపీ కేశినేని నాని కామెంట్స్


ఓడీఎఫ్ అంటే


మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఓడీఎఫ్‌(బహిరంగ మల విసర్జన రహిత)గా గుర్తిస్తారు. ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్‌ ఉండడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు, రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. 


Also Read: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి