Telangana RTC: ప్రయాణికులకు గమనిక.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో నిర్ణయం.. కుదిరితే రాష్ట్రవ్యాప్తంగా..

ఆర్టీసీ ఎండీగా వచ్చినప్పటి నుంచి ప్రయాణికుల సౌకర్యాల కోసం సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

Continues below advertisement


బస్ స్టేషన్లలో చెల్లింపులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వస్తుంది. అయితే ఆ సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Continues below advertisement

ఆర్టీసీ ఎండీగా నియమితులైనప్పటి నుంచి.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు సజ్జనార్. తనదైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.. సంస్థను లాభాల్లో నడిపించేదుకు చర్యలు తీసుకుంటున్నారు. సజ్జనార్ నిర్ణయాలతో సంస్థ ఉద్యోగుల్లోనూ ఉత్తేజం వస్తుంది. 

బస్టాండ్ లలో వివిద సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. ఈ సేవలను ప్రారంభమైన టైమ్ లో ప్రయాణికుల నుంచి అభిప్రాయలు అడిగారు సజ్జనార్. యూపీఐ టెల్లింపులపై అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో జూబ్లీ బస్ స్టేషన్లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పార్సెల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. విజయవంతంపై అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. 

Also Read: TSRTC: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులు అలా కనిపించవు

Also Read: Sajjanar Encounter Enquiry : సజ్జనార్ బదిలీకి.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సంబంధం ఉందా..!?

Continues below advertisement