తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి పింఛను, రేషన్ ఇవ్వడం నిలిపివేస్తామని వచ్చిన వార్తలు తప్పు అని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా సహా ప్రముఖ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నిర్దేశించారు. అంతేకానీ, వ్యాక్సిన్ వేయించుకోనంత మాత్రాన రేషన్, పెన్షన్ కట్ చేస్తామని తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు.


మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది. ఇకపై రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి పెన్షన్లు, రేషన్ సరకులను నిలిపివేయాలని నిర్ణయించిందని దాని సారాంశం. నవంబరు 1 నుంచి ఈ నిబంధనను పటిష్ఠంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రధాన మీడియా సంస్థలు సహా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది.


Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !


రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోయినా కూడా రేషన్, పెన్షన్ బంద్ నిబంధన వర్తిస్తుందని నకిలీ వార్త వచ్చింది. నవంబరు 1 నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని డీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపినట్లుగా నకిలీ వార్త వచ్చింది. హైకోర్టు ఆదేశించాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ వార్తలో ఉంది. తాజాగా డీహెచ్ స్పష్టత ఇవ్వడంతో ఈ నకిలీ వార్త వ్యాప్తికి అడ్డుకట్ట పడినట్లయింది.


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకుని, రెండో డోస్ వేసుకోనివారు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. డోస్ తీసుకోవాల్సిన నిర్దేశిత తేదీ దాటిపోయినా కూడా వారు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ విషయంపై అధికారులు పదేపదే సూచనలు చేస్తున్నారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో కూడా రెండు కోట్ల డోసులుకు దగ్గరగా ఉంది. కానీ, 60 లక్షలకు పైగా ప్రజలు ఒక్క డోసు కూడా వేయించుకోలేదు. తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో దాదాపుగా అందరూ ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోనివారే ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటోంది. మూడో వేవ్ రాకుండా ఉండాలంటే, వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అధికారులు తొలి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే.


Also Read: Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు


Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి