తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(UNWTO).. పర్యాటకం విభాగంలో పోచంపల్లి ఉత్తమ గ్రామంగా ఎంపిక చేసింది.
డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్ డబ్ల్యూటీవో(UNWTO) జనరల్ అసెంబ్లీ 24వ సమావేశాల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డు సాధించడంపై కేంద్ర సంస్కృతి, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పోచంపల్లి గ్రామ ప్రజలను అభినందించారు. పోచంపల్లి నేత శైలి చాలా అరుదు అన్నారు. ఈ నమూనాలపై ఆత్మ నిర్భర్ భారత్ వోకల్ 4 లోకల్ ద్వారా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు
పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డు రావడంపై ప్రత్యేకంగా పోచంపల్లి ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇతర ఎంట్రీలను సమర్ధవంతంగా సమర్పించినందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. UNWTO పైలట్ చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదర్శంగా నిలిచే గ్రామాలను తొమ్మిది విభాగాల్లో గుర్తించి అవార్డులు ప్రకటించారని మంత్రి అన్నారు.
Also Read: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
భారత్ నుంచి మూడు గ్రామాలు పోటీ
గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను మెరుగు పరిచే లక్ష్యంతో యూఎన్ డబ్ల్యూటీవో ఉత్తమ పర్యాటక గ్రామాలను గుర్తించి అవార్డులు అందిస్తుంది. భారతదేశం నుంచి UNWTO ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డు కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మూడు గ్రామాలను సిఫార్సు చేసింది. మేఘాలయలోని కొంగ్‌థాంగ్, మధ్యప్రదేశ్ లోని లధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి సిఫార్సు చేయగా
పోచంపల్లి గ్రామానికి అవార్డు లభించింది.
Also Read: వాగులో బాలురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాల వెలికితీత, మంత్రి కేటీఆర్ ఆవేదన
జియోలజికల్ ఇండెక్స్ గుర్తింపు
పోచంపల్లి.. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ ప్రత్యేకమైన శైలిలో నేతన్నలు సున్నితమైన చీరల నేస్తారు. అందుకే పోచంపల్లిని తరచుగా సిల్క్ సిటీ అని పిలుస్తారు. నేతన్నల శైలి పోచంపల్లి ఇకత్ 2004లో భౌగోళిక సూచిక (GI) స్టేటస్ పొందింది.
మంత్రి కేటీఆర్ ట్వీట్
పోచంపల్లికి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం