తెలంగాణలో ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా వచ్చిన కేసుల్లో ఇటీవల దేశానికి వచ్చిన 9 మంది విదేశీయులు ఉన్నారు. ఈ కేసుల్లో కెన్యాకు చెందిన వారు 6, సోమాలియా 2, యూఏఈ 2, ఘనా 1, టాంజానియా ఒకరు ఉన్నారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20కు చేరింది. 


Also Read: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన


మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు


తెలంగాణలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 20కు చేరాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 7,206 మంది ప్రయాణికులు తెలంగాణకు వచ్చారు. వీరిలో 20 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంకా ముగ్గురి ఫలితాలు తెలియాల్సి ఉంది. 


Also Read:  కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా


కొత్తగా 185 కేసులు


తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,484 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 6,79,430కు చేరింది. శుక్రవారం కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,014కి చేరింది. కరోనా బారి నుంచి గడచిన 24 గంటల్లో 205 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,761 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. 


Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!


Also Read:  ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?


Also Read: 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు.. రైతు బంధు పథకం అమలుకు కేసీఆర్ ఆదేశం !


Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?


Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి