Sharmila Special Gift to CM KCR: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పాలనకు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అన్నారు. డిసెంబర్ 3న (ఆదివారం) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె సీఎం కేసీఆర్ (CM KCR) కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు 'బై బై కేసీఆర్' అని చెబుతున్నారని రాసి ఉన్న సూట్ కేసును కేసీఆర్ కు బహుమతిగా ఇస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. రేపటితో కేసీఆర్ అవినీతి, అక్రమ, నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల ఎక్సాక్ట్ పల్స్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తాము పోటీ చేస్తే కాంగ్రస్ ను సులంభంగా ఓడించగలదని, కానీ తమ ఉద్దేశం కేసీఆర్ ను గద్దె దించడమేనని, అందుకే కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు స్పష్టం చేశారు.


'ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలి'


తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని షర్మిల ఆకాంక్షించారు. కేసీఆర్ కు పదేళ్లు అధికారం ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గత 2 ఎన్నికల్లో కేసీఆర్ 45 మంది ప్రజా ప్రతినిధులను కొన్నారని, ఈసారి ప్రజల తీర్పును బీఆర్ఎస్ నేతలు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. రేపు మరో విమోచన దినోత్సవం కావాలని అన్నారు. తాను పార్టీని పెట్టిన మొదటి నుంచి కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలనపై పోరాడానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఆ పార్టీకి తెలంగాణలో గ్రాఫ్ పెరిగిందని, కర్ణాటక ఎన్నికల్లో ఇది చూశామని చెప్పారు. తాము పోటీ చేసి ఉంటే సులభంగా గెలిచేవారమని, అయితే, బరిలో నిలిస్తే వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ గెలిచే అవకాశం ఉంటుందని, అందుకే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేశారు. అన్నీ తెలిసే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చామని, తనతో పోరాటం చేసిన వారు, తన పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరడం బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. 


బీజేపీపై విమర్శలు


కేసీఆర్ అవినీతిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం చర్యలు తీసుకోలేదని, ఆ 2 పార్టీలు కలిసే ఉన్నాయని షర్మిల్ అన్నారు. లిక్కర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై చర్యలేవీ.? అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ నైజం కొనడమే అని, 2014లో టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి 7, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. 2018లో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఈసారి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చెయ్యొద్దని హితవు పలికారు. 


సీఎం పదవికి వారే అర్హులు


తెలంగాణ కాంగ్రెస్ లో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారని షర్మిల్ అన్నారు. ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క సీనియర్, పాదయాత్ర కూడా చేశారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం పదవికి అర్హులని చెప్పారు. సీఎం ఎవరనేది ఆ పార్టీ నేతలే తేల్చుకుంటారని పేర్కొన్నారు. బ్లాక్ మెయిలర్స్ మాత్రం సీఎం కాకూడదని ఆకాంక్షించారు.


Also Read: Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్