Logically Facts Fact Check:



ఎన్నికల ర్యాలీలో పాకిస్థాన్ జెండా 


నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే...కాంగ్రెస్ ప్రచార సమయంలో కొందరు పాకిస్థాన్ జెండా పట్టుకుని తిరిగారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. కార్యకర్తలంతా కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ర్యాలీ చేస్తుండడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఓ వ్యక్తి పాకిస్థాన్‌ జెండా పట్టుకుని కనిపించాడు. ఈ వీడియో తీసిన వ్యక్తి "పాకిస్థాన్ జెండా" అంటూ గట్టిగా అరిచాడు. "ఇలాంటి పార్టీకి ఓటు వేయాలనుకోడం సిగ్గుచేటు" అని నినదించాడు. ఫేస్‌బుక్‌లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. "రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాకిస్థాన్‌ జెండాతో ప్రచారం చేస్తోంది. రాజస్థాన్‌ని పాకిస్థాన్‌గా మార్చేయాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌ని తరిమి కొట్టాలి" అంటూ పోస్ట్ పెట్టారు. ఇదే పోస్ట్‌ ట్విటర్‌లోనూ చక్కర్లు కొట్టింది. అయితే...దీనిపై ఫ్యాక్ట్ చెక్‌ చేయగా ఇది పాత వీడియో అని, అసలు ఇది రాజస్థాన్‌లోనే కాదని తేలింది. Logically Facts ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. 



Source: Facebook/Screenshot


నిజమేంటి..?


ఈ వీడియోని (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ ఆకుపచ్చ జెండా పాకిస్థాన్‌ ఫ్లాగ్‌ కాదని అర్థమైంది. పాకిస్థాన్ జెండాపై నెలవంక, నక్షత్రం ఉంటాయి. ఎడమ వైపు తెల్లని గీత ఉంటుంది. కానీ...ఈ వీడియోలో కనిపించిన జెండాపై రెండు వైపులా తెల్లని గీతలున్నాయి. బ్లూ కలర్‌లో ఏవో అక్షరాలున్నాయే తప్ప నెలవంక,నక్షత్రం కనిపించలేదు. ఈ వీడియోలని కీ ఫ్రేమ్‌ని స్క్రీన్‌షాట్‌ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ (Reverse Image Search) చేస్తే అసలు నిజం తెలిసింది.



Source: Facebook/Screenshot


2018లో డిసెంబర్ 11వ తేదీన ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ పెట్టారు. అందులో నుంచే ఈ వీడియో క్లిప్ కట్ చేశారు. అంటే...ఇది ఇప్పటి వీడియో కాదన్న క్లారిటీ వచ్చింది. ఇక ఈ వీడియోలో 0:13 సెకన్ల వద్ద ఓ బండిపై ఓం సింబల్ కనిపించింది. దానిపై కొన్ని మొబైల్ నంబర్స్‌ కూడా ఉన్నాయి. ఆ నంబర్‌కి కాల్‌ చేసి మాట్లాడింది Logically Facts. అది పాకిస్థాన్ జెండా కాదని, దగ్గర్లోని మసీదు వద్ద జెండాని ఎవరో పట్టుకొచ్చి ఇలా ర్యాలీలో తిరిగారని చెప్పారు. ఇదొక్కటే కాదని, హిందూ సంస్థలకు చెందిన జెండాలనూ తీసుకొచ్చారని స్పష్టతనిచ్చారు. 2018 డిసెంబర్‌లోనూ ఈ వీడియో వైరల్ అయింది. పలు మీడియా సంస్థలూ ఇది రాజస్థాన్‌లోని ర్యాలీలోనే జరిగిందని వార్తలు రాశాయి. రాజస్థాన్ పోలీసుల వివరణనూ అందులో పబ్లిష్ చేశాయి. రాజస్థాన్‌లోని ర్యాలీలో పాకిస్థాన్ జెండా పట్టుకుని తిరిగారన్న వీడియో వైరల్ అవుతోందని, కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరు ఈ పోస్ట్ క్రియేట్ చేశారో పట్టుకుంటామని వెల్లడించారు. అంటే...ఈ మధ్య జరిగిన రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి, ఈ వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఆ పోస్ట్‌లన్నీ ముమ్మాటికీ తప్పుదోవ పట్టించేవేనని Logically Facts తేల్చి చెప్పింది. కావాలనే కొందరు ఇలా ప్రచారం చేశారని వెల్లడించింది. 



Source: Facebook/Screenshot


                                                                                                                                                             By: Ankita Kulkarni


Disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Live as part of a special arrangement.