KS Sreenivasa Raju: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీనివాసరాజు నియామకం అయ్యారు.
మరోవైపు, రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం (జూలై 1) ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరింత మందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్ బాబా సాహెబ్, గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్ నియమితులు అయ్యారు.
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాశ్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత నెలలోనూ పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు, పలు జోన్లకు డీసీపీలను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసిన సంగతి తెలిసిందే.