తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్రకాశ్‌, త‌క్కెళ్లప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైన‌ట్లు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థుల‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందించారు. ఈ నెల 16న టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్యర్థులు గుత్తా సుఖేంద‌ర్‌‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, పాడి కౌశి‌క్‌‌రెడ్డి, వెంక‌ట్రా‌మి‌రెడ్డి, తక్కె‌ళ్లపల్లి రవీంద‌ర్‌‌రావు నామి‌నే‌షన్లు దాఖలు చేశారు. అదే రోజు నామినేషన్లు దాఖ‌లు చే‌సిన మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామి‌నే‌ష‌న్లను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిరస్కరించారు. దీంతో టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్యర్థుల ఏక‌గ్రీ‌వ‌మైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 


Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్


స్థానిక కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే...!


టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవం అయ్యే  అవకాశం ఉంది. ఇతర పార్టీలు పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. నిజానికి 12 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్‌కు విజయం సాధించడానికి అవసరమైన స్పష్టమైన బలం ఉంది. అయితే అదే సమయంలో కనీసం నాలుగైదు చోట్ల కనీసం పోటీ ఇవ్వడానికి అవకాశం ఉన్న స్థాయిలో ఇతర పార్టీలకు ప్రతినిధులు ఉన్నారు. కానీ పోటీ  చేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 


Also Read: Mlc Elections: టీఆర్ఎస్ స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...!


ఎమ్మెల్సీ ఎన్నికలపై కమిటీ


ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అధినేత మత్రమే అభ్యర్థుల్ని ప్రకటించి బీఫాం ఇచ్చారు. ఇతర పార్టీల్లో అభ్యర్థులపై ఎలాంటి చర్చ జరగలేదు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఓ కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కల్వకుంట్ల కవిత పోటీ చేసినప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి కాంగ్రెస్ పోటీ పెట్టింది. నల్లగొండ, ఖమ్మం వంటి చోట్ల పోటీ చేయడానికి తగినంత బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది.


Also Read: 12 ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమే.. పోటీకి సిద్దంగా లేని ఇతర తెలంగాణ పార్టీలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి