Junior Doctors call off strike In Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాల సమస్యల పరిష్కారంతో పాటు వారి డిమాండ్లు నెరవేర్చడంపై మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. దాంతో జూడాలు సమ్మె విరమించారు. ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. జూనియర్ డాక్టర్లు మొత్తం ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా.. ప్రస్తుతం 6 డిమాండ్లు పరిష్కారానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.


నిధుల విడుదలకు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 
ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీలలో వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. జూడాలతో చర్చలు జరిపిన తరువాత గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్ల వసతిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతోపాటు వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణ కోసం నిధుల ఇచ్చేందుకు రూ.204.85 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఉస్మానియా, గాంధీలో ఆస్పత్రిలో హాస్టల్స్ నిర్మాణానికి రూ.121.90 కోట్లు, రూ.79.50 కోట్లు.. కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల కోసం రూ.2.75 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయడం తెలిసిందే. దీంతో మొదట జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమణకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు వైద్యారోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో జూనియర్ డాక్టర్లు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించారు. జూన్ 25న జరిపిన చర్చలు కొన్ని ఫలించడంతో బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. ఇతర డిమాండ్లు పరిష్కరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విమరణకు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా మీడియాకు వెల్లడించారు.