Pinnelli Ramakrishna Reddy was arrested : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసిన నిమిషాల్లోనే ఆయనను నర్సరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు ఆయన పాస్ పోర్టును కోర్టులో సమర్పించారు. రోజూ నర్సరావుపేట పల్నాడు ఎస్పీ ఆఫీసులో సంతకం పెడుతున్నారు.
పోలింగ్ రోజు మాచర్లలో విధ్వంసం
మాచర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను పగులగొట్టారని ఆరోపణలు వచ్చాయి. పాల్వాయి గేట్ అనే గ్రామం పోలింగ్ బూత్ లో ఆయన నేరుగా వెళ్లీ ఈవీఎంను పగులగొట్టారు. కానీ అక్కడి సిబ్బంది గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారని చెప్పడంతో అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలింగ్ అనంతరం కారంపూడితో పాటు మాచర్ల టౌన్ లో కూడా దాడులు జరిగాయి. పిన్నెల్లి సొంత గ్రామంలో ఓ టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం జరిగింది. పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగులగొట్టినప్పుడు టీడీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో ఆయనపైనా హత్యాయత్నం చేశారు. ఇలా మొత్తం మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
కేబినెట్ హోదా కోసమే - రూల్ బుక్ చదువుకోవాలి - జగన్‌కు పయ్యావుల స్ట్రాంగ్ కౌంటర్
అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి
ఆయనను అరెస్టు చేస్తారనుకున్న సమయంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలు ఆయనను పట్టుకునేందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఛేజింగ్ కూడా చేసినా దొరకలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కౌంటింగ్ కు వెళ్లాల్సి ఉందని చెప్పి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ సందర్భంగా నర్సరావుపేటలోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పట్నుంచి ఆయన నర్సరావుపేటలోనే ఉంటారు. ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు.. ఈ కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయమూర్తి పరిధిని అతిక్రమించారన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆయనను కౌంటింగ్ కు వెళ్లకుండా బ్యాన్ చేసి.. పిటిషన్లను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించారు.
గోదావరి జిల్లాల్లో సోషల్ ఇంజినీరింగ్ సక్సెస్ - కాపు, శెట్టిబలిజ కాంబినేషన్‌తో టీడీపీ సిక్సర్
పరారీలోనే సోదరుడు
హింసకు కారణం అయిన ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కూడా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన సోదరుడ్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించే అవకాశం ఉంది. మాచర్లను ప్రత్యేక సామ్రాజ్యంగా మార్చుకుని చాలా కాలంగా రాజకీయం చేస్తున్న పిన్నెల్లికి గడ్డు పరిస్థితి ఎదురయ్యాయి. భారీ తేడాతో ఓడిపోయారు కూడా.