European Football Championship 2024: UEFA ఆస్ట్రియా చరిత్ర సృష్టించింది. తమపై ఏళ్లుగా తిరుగులేని ఆధిక్యం చూపుతోన్న నెదర్లాండ్స్ జట్టుపై  అనూహ్యంగా గెలిచి  ఆ జట్టుకు షాకిచ్చింది. యూరోపియన్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో సంచలనం చోటు చేసుకుంది 


సరిగ్గా 36 ఏళ్ల క్రితం జూన్ 25 వ తారీఖునే  రడ్ గుల్లిట్, మార్కో వాన్ బస్టెన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన నెదర్లాండ్స్ ఫుట్ బాల్  జట్టు సోవియట్ యూనియన్ జట్టుని 2-0 తో ఓడించి యూరోపియన్ ఛాంపియన్ షిప్‌ను గెలిచి డచ్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించింది.  


ఆ చరిత్రకు వార్షికోత్సవంగా నెదర్లాండ్స్ ఏటా జరుపుకునే జూన్ 25 అంటే నిన్న కూడా ఓ మ్యాజిక్ జరిగింది. కానీ ఈ సారి ఫలితం గతంలో జరిగిన దానికి భిన్నంగా ఉంది. నెదర్లాండ్స్ ఈ సారి విజేత కాదు.  3-2 తేడాతో నెదర్లాండ్స్ ని ఓడించి ఆస్ట్రియా ఈ సారి అలాంటి చరిత్రే లిఖించింది.  


చాలా ఏళ్లుగా ఆస్ట్రియా  జట్టుపై నెదర్లాండ్స్ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తూ వస్తోంది. గత ఏడు మ్యాచుల్లో చూసినా నెదర్లాండ్స్ దే ఆధిపత్యం . అసలు ఆస్ట్రేలియా నెదర్లాండ్ పై  1990 తరువాత గెలిచిందే లేదు. . 


కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.  మంగళవారం జరిగిన యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో సంచలనం చోటు చేసుకుంది.   మ్యాచ్ లో ఆస్ట్రియా ఈ చరిత్రను తిరగరాసింది. డచ్ జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రియా 3.2 తేడాతో గెలిచింది.  


నెదర్లాండ్స్ మేనేజర్ రోనాల్డ్ కోమన్ తన జట్టుని చాలా ప్రోత్సహించాడు. వాళ్లు తమ ప్రయత్నం చేశారు కూడా. కానీ ఇంతలో సెల్ఫ్ గోల్ వారి కొంప ముంచింది.  దీంతో డచ్ టీమ్ భారీ మూల్యం చెల్లించింది. 


అలెగ్జాండర్ ప్రాస్ పాస్ చేసిన బాల్ డేంజరస్ ప్లేస్ కి వెళ్తుంటే డోన్ యెల్ మలెన్ దాన్ని అందుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ అవ్వలేదు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రియా ఆటతీరు చాలా మెరుగ్గా కనిపించింది. ప్రత్యర్థిని గెలవాలంటే ప్రత్యర్థి లాగే ఆడాలన్న సూత్రం పాటించిన ఆస్ట్రియా.. ఆటపై పట్టు కోల్పోయినప్పుడల్లా తిరిగి సాధించేందుుకు అచ్చం డచ్ జట్టులా ప్రయత్నించింది. కానీ నెదర్లాండ్స్ ఎప్పటిలా ఆడలేదు. వాళ్లు ఆడిన తీరు వల్లే ఈ గేమ్లో వాళ్లు ఓడిపోయారు. 


23 వ నిమిషంలో మాలెన్‌కి ఒక అవకాశం వచ్చినా దాన్ని అతను వినియోగించుకోలేకపోయాడు. తిజ్జని రెయిజండర్స్ తెలివిగా రివర్స్ పాస్ ఆడటంతో మాలెన్‌ కు మంచి అవకాశం వచ్చింది. కానీ మాలెన్ బంతిపై నియంత్రణ కోల్పోవడంతో అది కాస్తా గోల్ పోస్టుకు దూరంగా వెళ్లిపోయింది. కొంత ప్రయత్నించి ఉంటే ఆ బంతి గోల్ పోస్టు దాటేది వాళ్లు 3-3 తో కనీసం ఈ మ్యాచ్ ను డ్రా చేసుకునే వాళ్లు.


విచిత్రం ఏంటంటే నెదర్లాండ్ పై నియంత్రణ కోసం ఆస్ట్రేలియా మొదటి 30 నిమిషాల వరకూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ లోపు తన ప్రయత్నం సజావుగా చేసిన నెదర్లాండ్స్ రెండు గోల్స్ సాధించింది.  35 నిమిషాల తరువాత ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకెళ్లాలని జట్టు నిర్ణయించడం పట్ల జట్టు మేనేజర్  కోమన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది. 


దాదాపు 38 వ నిమిషంలో మార్కో ఆర్నాటోవిక్‌కు ఆస్ట్రియా ఆధిక్యాన్ని రెట్టింపు చేసే అవకాశమొచ్చింది.  కానీ బంతి తన దగ్గరే ఉన్నా అతను దాన్ని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. మ్యాచ్  సెకండ్ హాఫ్ లో ఆస్ట్రియా ముందున్న సవాలేంటంటే వారికి వచ్చిన ఆధిక్యాన్ని కొనసాగించడం.  కానీ వారు స్థిరపడకముందే నెదర్లాండ్స్ స్కోర్లు సమం చేసింది. ఆ గోల్ ఆస్ట్రియాను కొంచెం కదిలించినట్లు అనిపించింది .నెదర్లాండ్స్ తమ నియంత్రణను తీసుకుంటుందనుకున్న సమయంలో.. ఆస్ట్రియా చివరి గోల్ చేసి మ్యాచ్ ని ఎగరేసుకు పోయింది.