Anantapur రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం లెక్కలు సమీకరణాలు ఎవరికీ అంతు పట్టని విధంగా ఉంటాయి. అలాంటి నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి. అనంతపురం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో పార్టీల హవా కంటే కుటుంబాల పెత్తనమే ఎక్కువగా కనిపిస్తుంది. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచుకోటను గత ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి బద్దలు కొట్టారు. అలాంటి చోట పట్టు సాధించుకోవడానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది. 4 దశాబ్దాలుగా తాడపత్రి నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన జేసి కుటుంబానికి 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 


వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు 
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జెసి కుటుంబం టార్గెట్ అయింది. రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న జెసి కుటుంబాన్ని  దెబ్బతీసేందుకు అనేక విధాలుగా అప్పటి ప్రభుత్వం.. మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి జెసి కుటుంబ సభ్యులపై అనేక కేసులను బనయించారు. వీటిలో ముఖ్యంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ పై ట్రాన్స్పోర్ట్ అధికారులతో దాడులు చేయించి వాహనాలకు సరైన పర్మిషన్లు లేవని ట్రావెల్స్ మూతపడేలా చేశారు. దీనికి సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ జెసి అస్మిత్ రెడ్డి 54రోజులు కడప జైలుకు వెళ్లి వచ్చారు. వీరితోపాటు వీరి కుటుంబ సభ్యులపైన కూడా అనేక కేసులు అప్పట్లో నమోదు అయ్యాయి. వీటి అన్నిటి వెనకాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. 


వైసిపి ప్రభుత్వంపై జెసి ప్రభాకర్ రెడ్డి పోరాటం  
వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు తాడిపత్రి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అంటూ ఇసుక రిచ్‌ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలపైన అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తున్నారనీ అనేక సందర్భాల్లో జిల్లా ఎస్పీలకు కూడా ఫిర్యాదుల అందించారు. తాడపత్రి మున్సిపల్ పరిధిలో వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలను అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని అప్పుడు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా ఫిర్యాదు చేశారు. 


ఎమ్మెల్యేగా తాడిపత్రిలో అడుగుపెట్టని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి 
ఎమ్మెల్యేగా గెలిచి 21 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు తాడిపత్రి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి అడుగు కూడా పెట్టలేదు. తాడపత్రిలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన అల్లర్లు గొడవల విషయంలో ఇరు పార్టీల నేతలను పెద్ద ఎత్తున పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరుపార్టీల నేతలు జెసి అస్మిత్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకి సంబంధించి ముందస్తు బెల్టు అప్లై చేసుకున్న నేతలకు తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనపైన దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డిని 26 వరకు తాడిపత్రిలోకి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో కోర్టు గడువు ముగిండటంతో అనంతరం కోర్టు ఇచ్చే షరతులతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.