ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిందో మహిళ. అక్కడ ఇంటి యజమాని పెట్టే బాధలు భరించలేక తిరిగి దేశానికి వచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఇంతలో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుటుంబ సభ్యులకు ఆమె పంపిన ఆడియో వైరల్ అవుతోంది. ఏంచేయాలో తెలియక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 


Also Read:  తెలంగాణలో తాగు-తాగించు పథకాలు... కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ ఉండదు...


యజమాని వేధింపులు


తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కి చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలను అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా ఆమె తన అన్న ద్వారా నిజామాబాద్ లో గల్ఫ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న రవి కుమార్ కు పరిచయం చేయించింది. రవికుమార్ సత్తమ్మ వయస్సుతో పాటు మతాన్ని మార్చి పాస్ పోర్టు తీసకున్నాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని సత్తమ్మను మస్కట్ పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మను ఇంటి యజమాని వేధించడం మొదలుపెట్టాడు. యజమాని దాడిలో తన చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. 


Also Read:  జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...


రూ.లక్ష చెల్లించాలని ఏజెంట్ డిమాండ్


దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, సత్తమ్మను మస్కట్ పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, రూ. లక్ష తిరిగి చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్ షాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్ పోల్ తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. శనివారం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో సత్తమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చంద్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read:  మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !


Also Read: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి