Fact Check Inter Results:  మొదట పరీక్షలు.. తర్వాత ఫలితాలు .  టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఈ టెన్షన్ ప్రతీ ఏటా ఉంటుంది. ఈ టెన్షన్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. వారి ఆసక్తిని గమనించి.. అదిగో ఫలితాలు.. ఇదిగో ఫలితాలు అంటూ తప్పుడు ప్రచారం చేసి..  వైరల్ చేస్తున్నారు. దీంతో టెన్షన్ పిల్లలకే కాదు ఇంటర్ బోర్డుకూ కలుగుతోంది. 

Continues below advertisement


అనుపమ ట్వీట్‌కు ఉలిక్కిపడ్డ బల్దియా ! హీరోయిన్ ఏం చేసిందంటే ?


రేపే ఇంటర్‌ ఫలితాలు ( Inter Results Rumors )  విడుదల అవుతున్నాయంటూ సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఈ వార్తలను చూసి చాలా మంది విద్యార్థుల్లో కంగారు మొదలైంది.  ఈ స్పెక్యులేషన్స్‌పై  ( Results Fake News ) ఇంటర్ బోర్డు స్పందించింది. అనవసరమైన వార్తలను చూసి కంగారు పడొద్దని విద్యార్థులకు సూచించింది. రిజల్ట్స్‌ విడుదల తేదీని తామే అధికారికంగా ప్రకటిస్తామని అప్పటి వరకు ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా నమ్మొద్దని  ఇంటర్ బోర్డ్ (  Inter Board ) సూచించింది.  విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయొద్దని సూచించింది ఇంటర్ బోర్డు.


నిజంగా పీకే సర్వేలు లీకయ్యాయా ? సోషల్‌ మీడియాలో వైరల్ రిపోర్టుల్లో నిజమెంత !


తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 24వ తేదీతో ముగిశాయి.  ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో వేగం పెంచారు. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 


సామాన్యులకు LPG సిలిండర్ మంట, ఒకేసారి రూ.750 పెంపు - వారికి మాత్రం ఊరట


జూన్‌ రెండో వారం చివరి నాటికి స్పాట్‌ వాల్యుయేషన్‌ ( Spot Valueation ) పూర్తి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంకా ఫలితాలు ( Results Not Ready ) సిద్దం కాలేదు. ఫలితాలు సిద్ధమైన తర్వాత అదికారికంగా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు చెబుతోంది. అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరుతోంది.