తెలంగాణలో అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడే తేదీ ఖరారైంది. జూన్‌ 26 నుంచి రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ కూడా రైతుబంధు సాయం అకౌంట్లలో పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


తెలంగాణ రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని, ఇందుకోసం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.