Rashmika: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. తెలుగులో ‘చలో’ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తోన్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే  అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా రష్మికకు ఫాలోయింగ్ ఎక్కువే. ఏదొక విషయంలో ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా రష్మిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన మేనేజర్ చేతిలో రష్మక భారీగా మోసపోయిందట. ఇప్పుడిదే నెట్టింట వైరల్ గా మారింది. 


మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక..


ఇండస్ట్రీలో ప్రతీ హీరో, హీరోయిన్లకు మేనేజర్లు ఉంటారు. వారి షూటింగ్ షెడ్యూల్స్, రెమ్యునరేషన్ ఇలా చాలా విషయాలను మేనేజర్లే దగ్గరుండి చూసుకుంటారు. అలాగే రష్మిక దగ్గర కూడా ఓ మేనేజర్ పనిచేస్తున్నాడు. అతను రష్మిక ఇండస్ట్రీకు వచ్చినప్పటి నుంచీ మేనేజర్ గా చేస్తున్నాడు. ఇటీవల ఆ మేనేజర్ రష్మికకు తెలియకుండా రూ.80 లక్షలు ఆమె నుంచి కాజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఆ మేనేజర్ తో గొడవపడి వెంటనే అతన్ని పనిలోనుంచి తీసేసిందట. అడిగితే తానే ఇస్తాను కదా, ఇలా నమ్మకం ద్రోహం చేయడం సరికాదని చెబుతూ క్షణాల వ్యవధిలోనే అతన్ని పంపేసిందట. ఈ వార్తే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం బయటకు వచ్చినా ఇప్పటి వరకూ రష్మిక టీమ్ గానీ లేదా ఆమె గానీ దీనిపై స్పందించలేదు. 


నిత్యం వార్తల్లో రష్మిక..


రష్మిక మందన్న సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. తన వ్యాఖ్యలతో లేదా ఆమె పై వచ్చే పుకార్లతో నిత్యం వార్తల్లోకెక్కుతుంటుందీ బ్యూటీ. గతంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై రష్మిక విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందనే పుకార్లు వచ్చాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తన మేనేజర్ చేతిలో మోసపోయింది అంటూ మరోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా రష్మిక ఏం చేసినా చేయకపోయినా వార్తల్లో నిలుస్తూ వస్తోందీ భామ.


ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకు ముందు వచ్చిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ అందుకోవడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘యానిమల్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే పలు ప్రాజెక్టుల్లో కూడా రష్మిక నటిస్తోంది.



Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!