దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ కాలేదనే చెప్పుకోవచ్చు. రామయణ ఇతిహాసాన్ని అద్భుతంగా తెరెక్కిస్తున్న ఓం రౌత్ చెప్పినా, సినిమా వరకు వచ్చే సరికి తేలిపోయింది. ఈ సినిమాను చూస్తుంటే ఏదో పిల్లల కార్టూన్ సినిమా చూసినట్లు ఉందని చాలా మది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని పలు కీలక అంశాల గురించి  విమర్శనాత్మక అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకీ, ఈ చిత్రం మీద ఇంత భయంకరంగా నెగెటివ్ టాక్ ఎందుకు వచ్చింది? ఓం రౌత్ చేసిన మిస్టేక్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  


1. రాముడి రూపం


సినిమాలో రాముడి రూపం హిందూ దేవుడిలా కాకుండా జీసస్ లాగా కనిపిస్తుందని చాలా మంది ప్రేక్షకులు విమర్శలు చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత సినిమాల్లో చూపించిన రాముడికి, ఈ సినిమాలో చూపించిన రాముడికి అసలు పొంతనే లేకపోవడం విమర్శలకు దారితీసింది. రాముడికి మీసాలు ఉండటం ఏమిటని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.


2. రావణుడి హెయిర్ స్టైల్


ఈ సినిమాలో తీవ్ర విమర్శలకు కారణం అయిన మరో క్యారెక్టర్ రావణుడు. ఆయన తలల, ఆయన కంటికి పెట్టిన సుర్మా, హెయిర్ స్టైల్ అన్నీ వింతగానే ఉన్నాయి. రావణ్ హెయిర్ స్టైల్ క్రికెటర్ విరాట్ కోహ్లి  హెయిర్ స్టైల్‌ను పోలి ఉందనే విమర్శలు వచ్చాయి. 


3. రావణుడి డైలాగులు


ఈ సినిమాలో రావణుడి పాత్రధారి పలికే కొన్ని డైలాగ్ లు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆయన సీత గురించి, శూర్పణక గురించి, హనుమంతుడి గురించి చేసిన కొన్ని డైలాగ్ లు వివాదాస్పదం అయ్యాయి. మా సోదరికి హాని చేసే వారికి నిప్పుపెడతా అనే రావణుడి డైలాగ్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


4. హనుమంతుడి రూపం, డైలాగులు


ఇక ఈ సినిమాలో హనుమంతుడి రూపం మీద కూడా విమర్శలు వచ్చాయి.  ఆయన డైలాగులపైనా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రత్యేకించి లంకా దహనం సన్నివేశం సమయంలో, హనుమంతుడు వాడిని కొన్ని పదాలు సరిగా లేవనే విమర్శలు వచ్చాయి.   


5. హనుమంతుడి నమస్కారం


రామాయణంలో హనుమంతుడు ఎప్పుడ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. అయితే, ఈ సినిమాలో ‘బ్లాక్ పాంథర్‘కు సంబంధించిన ‘వంకండ ఫరెవర్‘ సంజ్ఞ మాదిరిగా సీతను కలిసినట్లుగా చూపించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.   


6. ఇంద్రజిత్ శరీరం


ఇంద్రజిత్ రూపంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో ఇంద్రజిత్ శరీరంపై పెద్ద టాటూ వేసుకోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.   


7. సీతారాముల బంధం


ఈ సినిమాలో సీతారాముల మధ్యన ఉన్న సంబంధాన్ని కూడా దర్శకుడు సరిగా చూపించలేదనే విమర్శలు ఉన్నాయి.  


8. పేలవమైన హోంవర్క్


ఈ సినిమా కోసం దర్శకుడు చేసిన హోంవర్క్ చాలా పూర్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చూపించినట్లు సీతను ఎప్పుడూ రాముడు యుద్ధభూమిలోకి తీసుకెళ్లలేదంటున్నారు.  


9. కాస్టూమ్స్ ఎంపిక


ఈ సినిమాలో దుస్తుల ఎంపిక కూడా సరిగా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీరాముడు లెదర్ మెటీరియల్ ధరించడం, రావణుడు టీ-షర్ట్ వేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


10. రావణుడి తలలు


ఈ సినిమాలో రావణుడి పాత్రపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆయన తలలు డబుల్ డెక్కర్ మాదిరిగా ఉండటంపై  అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయం ఆడియెన్స్ కు ఆగ్రహం తెప్పించింది.


Read Also: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ కంటెస్టెంట్ ఔట్, ఇదే ఫస్ట్ టైమ్!