దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లో పలువురు స్టార్ హీరోలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో JioCinemaలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పునీత్ సూపర్ స్టార్ బిగ్ బాస్ OTT 2 హౌస్‌లోకి ప్రవేశించాడు. 12వ కంటెస్టెంట్ గా షోలోకి అడుగు పెట్టాడు. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా పునీత్ 24 గంటలు గడవక ముందే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇంత తక్కువ సమయంలో షో నుంచి తొలగించబడిని తొలి కంటెస్టెంట్ గా ఆయన చరిత్ర సృష్టించాడు.
BB OTT 2 నుంచి పునీత్ ను ఎందుకు తొలగించారంటే?
బిగ్ బాస్ OTT 2 హౌస్ లోకి పునీత్ సూపర్ స్టార్ ను సల్మాన్ ఖాన్ సాదరంగా స్వాగతించారు. చాలా మంది ప్రేక్షకులు సైతం పునీత్ రాకపట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటాడు అనుకున్నారు. కానీ, షో మొదలైన కొద్ది గంటల్లోనే ఆయన హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆయన ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా ఇంటి సభ్యులంతా కలిసి ఆయనను ఎలిమినేట్ చేశారు. ఈ తొలగింపు బిగ్ బాస్ షో లోనే సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. షో మొదలైన 24 గంటల్లోనే బయటకు వచ్చేశాడు. బిగ్ బిస్ హౌస్ లో ఉన్నంత సేపు ముఖానికి టూత్ పేస్ట్ పూసుకునే కనిపించాడు. అలా ఉండకూడదు అని చెప్పిన తోటి కంటెస్టెంట్లతో అనుచితంగా ప్రవర్తించాడు. బిగ్ బాస్ పదే పదే హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో బయటకు పంపక తప్పలేదు.
పునీత్ బిగ్ బాస్ షోలోకి రావడం పట్ల నెటిజన్ల సంతోషం
బిగ్ బాస్ OTT 2లో పునీత్ సూపర్ స్టార్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నట్లు జియో సినిమా మొదట వెల్లడించినప్పుడు, నెటిజన్లు హ్యాపీగా ఫీలయ్యారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో అతను ట్రోఫీని ఎగురవేస్తాడని చాలా మంది భావించారు. కానీ, ఆయన నెటిజన్ల ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచలేకపోయాడు. కొద్ది గంటల్లోనే బయటకు వచ్చాడు. పునీత్ సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బురద నీటిలో ఈత కొట్టడం, టూత్ పేస్టు, కారం పొడిని ముఖానికి పూసుకోవడంతో బాగా పాపులర్ అయ్యాడు. రోడ్ల మీద డ్యాన్సులు వేయడం, జనాలకు ఆసక్తి కలిగించేలా వీడియోలు చేయడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు ద్వారానే తను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.
బిగ్ బాస్ OTT 2 గురించి..
బిగ్ బాస్ OTT సీజన్ 2, జూన్ 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. సిమా తపారియా, అంజలి అరోరా, అవేజ్ దర్బార్, జియా శంకర్, పూజా గోర్ సహా పలువురు ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు.
Read Also: వయొలెంట్ పోలీస్‌గా కాజల్ అగర్వాల్ - ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా!