Bigg Boss OTT Season 2 : అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. జూన్ 17, 2023 నుంచి ప్రేక్షకులను అలరించనునందని ఈ ఏడాది మే 23న సల్మాన్ ఖాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆడియెన్స్, కంటెస్టంట్స్ ను ఎంతో అట్రాక్ట్ చేసే బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన వీడియో రిలీజైంది. ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్, పలు చిత్రాలు అభిమానులు అత్యంత విస్మయానికి గురిచేసేవిలా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ వెరైటీ ఇల్లును క్రియేటివ్ డైరెక్టర్ ఓమంగ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్, వనితా గరుద్ కుమార్ తమ నైపుణ్యాన్ని ఉపయోగించి రూపొందించారు. 


బిగ్ బాస్ OTT సీజన్ 2 'స్ట్రేంజ్ హౌస్'..


ఈ 'స్ట్రేంజ్ హౌస్' లో ప్రతీదీ అద్భుతంగా రూపొందించారు. అత్యంత సృజనాత్మకతతో బిగ్ బాస్ హౌస్ ను తయారు చేశారు. తాజాగా జియో సినిమా విడుదల చేసిన ఈ వీడియోలో.. గార్డెన్, ఆకుపచ్చ ఫ్లోర్, సిట్టింగ్ ప్రాంతంతో కుడి వైపున చెట్టు, ఎడమ వైపున స్విమ్మింగ్ పూల్ ఏరియాతో బ్యూటీఫుల్ లుక్ కనిపించింది.  స్విమ్మింగ్ ఫూల్ పక్కనే బాల్కనీకి దారితీసేలా బయటి నుంచి మెట్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెద్ద బిగ్ బాస్ ఐ లోగోను ప్రవేశ ద్వారం వద్ద ఉంచారు. కన్ను ఆకారాన్ని ప్రవేశద్వారంగా క్రియేట్ చేశారు. దీన్ని మొత్తం ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత లివింగ్ రూంలో అనేక రకాల దీపాలు, షాన్డిలియర్ల అలంకరణతో హాల్ ను అత్యంత కలర్ ఫుల్ గా తయారు చేశారు. ఇంటి వంటగది ప్రాంతం వంట చేసేందుకు చాలా అనుకూలంగా, అనువైనదిగా ఉంది. ఇక్కడ కూడా కలర్ ఫుల్ లైటింగ్ తో అందంగా రూపొందించారు. వంటగదిలోని కప్‌బోర్డ్‌ల తలుపులపై చెంచాలు, గరిటెలాంటి అనేక రకాల వంటగది పాత్రలు కనిపిస్తున్నాయి. డైనింగ్ ఏరియాలో స్ప్రింగ్‌లు, క్లిప్ హ్యాంగర్లు ఎంతో సృజనాత్మకతతో ఉపయోగించారు. డైనింగ్ టేబుల్ పైన పింక్ షేడెడ్ లైట్ బల్బులతో చేసిన భారీ ఆర్ట్ వర్క్ చాలా ఆకర్షిస్తోంది. ఈ డైనింగ్ స్పేస్ పక్కనే బీబీ ఓటీటీ బిగ్ బాస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఓ సిట్టింగ్ ఏరియాను ఈ సారి వెరైటీగా చేర్చారు. దీనిపై వివిధ ఆల్ఫాబెటికల్ దిండులతో నింపేశారు. 


ఆ తర్వాత బెడ్ రూం.. రంగు రంగుల బెడ్స్ చూపరులను అత్యంత ఆకర్షించేవిగా ఉన్నాయి. ఒక డబుల్ బెడ్ (ఒకదానిపై ఒకటి)ను ఏర్పాటు చేసినట్టు వీడియోను చూస్తే తెలుస్తోంది. బాత్ రూమ్ విషయానికొస్తే.. దీన్ని చూస్తుంటే.. ఈ సారి హౌస్ కు వచ్చిన కంటెస్టంట్లు రోజులో ఎక్కువ భాగం ఉంటారేమో అనిపిస్తుంది. టైర్లకు రంగులు వేసి.. వాటిని గోడకు అమర్చారు. వాటి కిందే వాష్ బేషిన్లు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. వీటి కింద కంటెస్టంట్లు పెట్టుకోవడానికి బాత్ రూంలో యూజ్ చేసే ఇతర ఐటెమ్స్ కోసం కప్ బోర్డులను ఏర్పాటు చేశారు. గార్డెన్ ఏరియా కూడా చాలా పీస్ ఫుల్ గా ఉంది. ఇక్కడ అందమైన గార్డెన్ తో పాటు ఓ చెట్టు.. దాని పక్కనే ఉన్న గోడపై వివిధ రకాల చిత్రాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు స్విమ్మింగ్ ఫుల్, పక్కనే కూర్చోవడానికి అనువుగా ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎప్పటిలాగే ఈ సారి కూడా బిగ్ బాస్ హౌస్ బ్యూటీఫుల్ అండ్ కలర్ ఫుల్ గా ఉంది.



మొదటిసారి హోస్ట్ గా సల్మాన్..


ఇప్పటివరకు టెలివిజన్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్లకు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించిన సల్మాన్ ఖాన్.. మొదటి సారి ఓటీటీ వెర్షన్ లో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్ గా ఉండనున్నారు. ఇక ఇటీవలే బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్న 13 మంది కంటెస్టెంట్ల ఫస్ట్ గ్లింప్స్‌ విడుదలైంది. ఇక బిగ్ బాస్ OTT రెండో సీజన్ జూన్ 17న జియో సినిమాలో ఉచితంగా ప్రసారం కానుంది.


Read Also : Adipurush: ప్రభాస్ ఫ్యాన్ అత్యుత్సాహం- బీర్ బాటిల్ తో చేయి కోసుకొని ప్రభాస్ కటౌట్ కు రక్తతిలకం!