Adipurush: ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ రామాయణ దృశ్యకావ్యం నేడు(జూన్ 16) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు. అయితే ఓ వీరాభిమాని మాత్రం తన అభిమాన హీరో కోసం ఏకంగా రక్తం చిందించాడు. అందుకు సంబంధిచిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


బీర్ బాటిల్ తో చేయి కోసుకొని ప్రభాస్ కటౌట్ కు రక్త తిలకం..


సినిమా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ మన టాలీవుడ్ లో హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరోలను ఒక్కసారి చూడాలని, కలిసి ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహపడుతూ ఉంటారు. ఇక ఫేవరేట్ హీరోల సినిమాల రిలీజ్ రోజు థియేటర్ల వద్ద అభిమానులు చేేసే హంగామా అంతా ఇంతా కాదు. ‘ఆదిపురుష్ ’ రిలీజ్ రోజు కూడా థియేటర్ల వద్ద అలాంటి వాతావరణమే కనిపించింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రీసెంట్ గా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేశారు. భారీ కటౌట్లు, కొబ్బరికాయలు, పూలదండలతో హోరెత్తించారు. తీన్మార్ డాన్స్ లతో హంగామా చేశారు. ఓ అభిమాని అత్యుత్సాహంతో ప్రభాస్ కటౌట్ వద్ద డాన్స్ చేస్తూ జై ప్రభాస్ అన్నా అంటూ బీర్ బాటిల్ ముక్కతో చేయి కోసుకున్నాడు. అలా నాలుగైదు సార్లు చేశాడు. ఆ రక్తంతో ప్రభాస్ ఫోటోకు తిలకం దిద్దాడు. ఇదంతా పక్కనే ఉన్న ఫ్యాన్స్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అంత అభిమానం ఉంటే రక్తదానం చేయొచ్చు కదా, ఇలా కోసుకోవడం ఎందుకు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


గ్రాండ్ గా ‘ఆదిపురుష్’ రిలీజ్..


‘ఆదిపురుష్’ సినిమా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా పై మొదట్లో కాస్త విమర్శలు వచ్చినా రిలీజ్ సమయానికి అంతా పాజిటివ్ గా మారిపోయింది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 6,200 లకు పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు. ఇప్పటికే మూవీ విడుదల అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీ గానే జరిగాయి. మరి మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ చేయగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. భూషణ్ కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 


Also Read : 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?