తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. నిన్న (ఆగస్టు 26) సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను బదిలీ చేసి ఆర్టీసీ ఎండీగా నియమించిన ప్రభుత్వం తాజాగా మరో 19 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతేకాకుండా తాజాగా నలుగురు సీనియర్ ఐపీఎస్​అధికారులకు డీజీపీ హోదా ఇచ్చి పదోన్నతి కల్పించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ మహేందర్‌ రెడ్డి జారీ చేశారు. 


సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న జి.హనుమంతరావు కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ అయ్యారు. అదే స్థానంలో ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ.చంద్రశేఖర్‌ను కూకట్‌ పల్లి ఏసీపీగా నియమించారు. కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బి.సురేందర్‌ రావును సైబరాబాద్‌ ఏసీపీ, ఎస్‌బీగా స్థాన చలనం కలిగించారు. ఇబ్రహీం పట్నం ఏసీపీగా ఉన్న యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పి.వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పి.సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఎ.యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అలాగే ఎ.అనిల్‌ కుమార్‌ కాగజ్‌నగర్‌ ఎస్డీపీఓగా, బాల కృష్ణారెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీగా, మాదాత రమేష్‌‌ను గజ్వేల్‌ ఏసీపీగా, ఆర్‌. శ్రీనివాస్‌‌ను ఆసిఫాబాద్‌ ఎస్డీపీఓగా, రత్నాపురం ప్రకాశ్‌ను జగిత్యాల ఎస్డీపీఓ, ఆర్‌ సతీశ్‌ కుమార్‌‌ను గోషామహల్‌ ఏసీపీగా, ఎన్‌. ఉదయ్‌ రెడ్డిని చౌటుప్పల్‌ ఏసీపీగా, సాయి రెడ్డి వెంకట్‌ రెడ్డిని భువనగిరి ఏసీపీగా, వాసాల సత్తయ్యను హుస్నాబాద్‌ ఏసీపీగా, ఎన్సీ రంగస్వామిని గద్వాల్‌ డీఎస్పీగా, కె.సైదులును మెదక్‌ ఎస్డీపీఓగా ప్రభుత్వం నియమించింది.


Also Read: Khammam: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి నీచపు పని.. ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం


డీజీపీగా పదోన్నతులు వీరికే..
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సహా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉమేష్ షరాఫ్‌, గోవింద్ సింగ్, రవి గుప్తాకు డీజీపీ హోదాను కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అంజనీ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై ఆయన డీజీపీ హోదాలోనే సీపీగా ఉండనున్నారు. గతంలోనే ఈ పోస్టును మహేందర్ రెడ్డి సీపీగా ఉన్నప్పుడు అదనపు డీజీ నుంచి డీజీ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మిగతావారు రవి గుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గోవింద్ సింగ్ సీఐడీ డీజీగా పని చేస్తున్నారు. ఉమేశ్ షరాఫ్ పోలీస్ శాఖ సంక్షేమ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇకపై వీరికి డీజీపీ హోదా రానుండగా.. అదే స్థానంలో కొనసాగనున్నారు.


ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, పశ్చిమమండలం ఐజీ స్టీఫెన్ రవీంద్రకు బుధవారమే స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్‌గా, సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ వచ్చినట్లయింది.


Also Read: Tank Bund No Entry: ట్యాంక్‌ బండ్‌పైకి ఈ టైంలో నో ఎంట్రీ, ఇక పర్మినెంట్‌గా ఇంతే.. సీపీ వెల్లడి


Also Read: Tollywood Drugs Case : క్లీన్‌చిట్ ఇచ్చిన కేసులో ఈడీ నోటీసులా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెర వెనుక ఏం జరుగుతోంది..?