తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది.  ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. 


Also Read: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!


జనవరి 2 వరకూ ఆంక్షలు 


ఒమిక్రాన్‌ విస్తరిస్తోన్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణచట్టం కింద ఆంక్షలు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించినట్లు పేర్కొంది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున్న జనం హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం పాటించాలని కోరింది. ప్రతీ ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. కార్యక్రమాల ప్రవేశద్వారాల వద్ద థర్మల్‌ స్కానర్లు ఏర్పాటుచేయాలని, వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.  బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్సీలు ఆంక్షల ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. సీఎస్ సోమేశ్‌ కుమార్‌ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 


Also Read:  కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్


హైకోర్టు ఆదేశాలతో 


తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి భౌతికదూరం పాటించడంలేదని కొందరు వ్యక్తులు హైకోర్టు ఆశ్రయించారు. రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి వేడుకల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు వేడుకలను నియంత్రించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. 


Also Read:  ఐటీఆర్‌ ఫైల్‌ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్‌!!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి