Telangana Government Launched Mana Yatri App: క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana Governent) కొత్త యాప్ ను ప్రారంభించింది. ఇక నుంచి ఓలా, ఊబర్ వంటి సంస్థలకు ఆటో, క్యాబ్ డ్రైవర్స్ కమీషన్ చెల్లించకుండా నేరుగా కస్టమర్ నుంచే డబ్బులు తీసుకునేలా 'మన యాత్రి' (Mana Yatri App) యాప్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గురువారం ISB డీన్ మదన్, జస్ పే సంస్థ అధికారులతో కలిసి యాప్ ను టీహబ్ సీఈవో శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే చెన్నై, బెంగుళూరు, కోల్ కతా, కొచ్చి వంటి మెట్రో నగరాల్లో ఈ యాప్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు సైతం భారం తగ్గి డ్రైవర్లకు మరింత అదనపు ఆదాయం చేకూరనుందని తెలిపారు. కాగా, తమ సంపాదనలో 30 నుంచి 40 శాతం కమీషన్ కే పోయేదని.. ప్రభుత్వం యాప్ లాంఛ్ చేయడం వల్ల ఇక నుంచి ఆ బాధ ఉండదని పలువురు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: KTR Saval To Revanth Reddy : దమ్ముంటే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేద్దాం రా - రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్ !