KTR Saval To Revanth Reddy : దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటు గెల్చుకుని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ కు దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రావాలని.. … మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు. అది అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలన్నారు. తాను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరం పదవులకు రాజీనామా చేసి పోటీ చేద్దామన్నారు. కేటీఆర్ చేసిన సవాల్ వైరల్ అవుతోంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం !
గెలిచిన ప్రతిసారి మగవాడిని ..ఓడితే కాదు అంటావా అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని మండిపడ్డారు. మగాడివి అయితే.. రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయి.. అడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలన్నారు. అడవాళ్లు రాజకీయాల్లో గెలవ వద్దా ఇవేం మాటలని మండిపడ్డారు. రేవంత్ కు ఆత్మన్యూనతాభావం ఉందన్నారు. కొండగల్, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి… సవాల్ విసిరి పారిపోయాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన మాటకు విలువ ఏం ఉందని ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపు ఒటములు సహజమన్నారు.
రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా !
తనను పదే పదే మేనేజ్‌మెంట్ కోటా లీడర్ అని అనడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా అని ప్రశ్నించారు. రేవంత్ ది పేమెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పదవులుతెచ్చుకున్న పేమెంట్ కోటా అన్నారు. పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… ఢిల్లీకి కప్పం కట్టాల్సి ఉందన్నారు. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారన్నారు. ఎన్ని ఆపారు.. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పై రోడ్ ఎక్కుతారని జోస్యం చెప్పారు. తానే సీఎం అని పదేపదే చెప్పుకుంటున్నారని.. అయనకు అయననే సీఎం అన్న నమ్మకం లేదా అని ఎద్దేవా చేశారు.
రేవంత్ కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తారా ?
చేవెళ్లసభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ , కేటీఆర్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఒక్క సీటులో అయినా గెలవాలని సవాల్ చేశారు. రేవంత్ చేసిన సవాల్‌తో పాటు.. చేసిన విమర్శలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో కేటీఆర్ అంతే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీకి సిద్ధమవుతారా లేదా అని.. బీఆర్ఎస్ నేతలు ఎదురదుదాడికి దిగే అవకాశం ఉంది.