Dharani Issues: తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళనలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. మార్చి 1 నుంచి 9 వరకూ అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆదేశాలు జారీ చేశారు.
Dharani Portal: ధరణిలో సమస్యలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు - కీలక గైడ్ లైన్స్ జారీ
ABP Desam | 29 Feb 2024 03:34 PM (IST)
ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం