రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను ప్రభుత్వం మొదట 31 జిల్లాలుగా మార్పు చేసింది. కొత్త జోనల్ వ్యవస్థని 2018లోనే మార్పు చేసినా.. రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 7 జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా 2018లోనే మార్చింది. వాటికి అప్పట్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాటిని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 30న జీవో 124 జారీ చేసింది. అందులో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు, పోస్టుల భర్తీలో అనుసరించే విధానాలన్నింటినీ వెల్లడించింది. వాటి ప్రకారం జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్‌ వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. 5 శాతం పోస్టులను మాత్రమే ఓపెన్‌ కోటా కింద పేర్కొంది.




ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్‌ పోస్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఇకపై ఉండదు. వాటిని మల్టీ జోన్‌ పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు కొత్త జీవోలో స్పష్టం చేసింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 33 జిల్లాలు అయ్యాయి. వాటితో పాటు గద్వాల జోన్‌లో ఉన్న వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం మళ్లీ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.


పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఇన్స్​పెక్టర్​ ఆఫ్​పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులను మల్టీజోన్ కేడర్‌కు తీసుకొచ్చారు.


మల్టీజోన్ ​కేడర్..


ఆర్డీవో, అసిస్టెంట్​ సెక్రెటరీ, సూపరింటెండెంట్, తహశీల్దార్, ఇ‌న్‌స్పెక్టర్ ​ఆఫ్ ​సర్వే(యూఎల్‌సీ), డిస్ట్రిక్​ రిజిస్టార్, అసిస్టెంట్ ​ఇ‌న్‌స్పెక్టర్​ జనరల్, గ్రేడ్​ –1 సబ్ రిజిస్టార్, అసిస్టెంట్​ డైరెక్టర్ ​సర్వే ల్యాండ్స్ రికార్డు, ఇ‌న్‌స్పెక్టర్ ​ఆఫ్​ సర్వే, అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ఇన్​ఫర్​మేషన్ ఇంజినీర్, పబ్లిక్​ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్‌ఫర్మేషన్ ​ఇంజినీర్, అడిషనల్ ​పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్​ డైరెక్టర్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, కార్పొరేట్ ​సబ్ రిజిస్టార్ వంటి పోస్టులన్నీ మల్టీజోన్​ కేడర్‌కు కేటాయించారు. పంచాయతీరాజ్‌లో గ్రేడ్ –1 పంచాయతీ కార్యదర్శిని జోనల్ ​పరిధికి తీసుకొచ్చారు. గ్రేడ్​–1తో పాటుగా గ్రేడ్ –2, గ్రేడ్​ –3, సానిటరీ ఇ‌న్‌స్పెక్టర్ ​గ్రేడ్ –2, పంచాయతీ లైన్ మెన్, ఫిట్టర్‌ను జోనల్‌కు తీసుకువచ్చారు. మల్టీజోన్​ పరిధిలోకి అకౌంట్ ఆఫీసర్స్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంఈవో, డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ ఎంపీఓలను చేర్చారు.


Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు