TS IFS Transfers : తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 17 మంది ఐఎఫ్ఎస్ లు, 8 మంది డీఎఫ్ఓలను బదిలీ చేసింది. పలువురు జిల్లా అటవీ అధికారులను కూడా బదిలీ అయ్యారు. 


అధికారుల బదిలీలు 


నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్ , పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్ గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్ షెట్టి , ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) గా ప్రవీణ బదిలీ అయ్యారు. సిద్దిపేట డీఎఫ్ఓగా కె.శ్రీనివాస్, హన్మకొండ, జనగామ డీఎఫ్ఓగా జె. వసంత, ములుగు డీఎఫ్ఓగా కిష్టాగౌడ్ , యాదాద్రి భువనగిరి డీఎఫ్ఓగా పద్మజారాణి, నిజామాబాద్ డీఎఫ్ఓగా వికాస్ మీనా బదిలీ అయ్యారు. రంగారెడ్డి డీఎఫ్ఓగా జాదవ్ రాహుల్ కిషన్ , నాగర్ కర్నూల్ డీఎఫ్ఓగా జి. రోహిత్ , మంచిర్యాల డీఎఫ్ఓగా శివ్ ఆశీష్ సింగ్, ఖమ్మం డీఎఫ్ఓగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్ , సంగారెడ్డి డీఎఫ్ఓగా సి. శ్రీధర్ రావు , చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా వి. వెంకటేశ్వరరావు , మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ఎం.అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. అమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవరావు, వికారాబాద్ డీఎఫ్ఓగా డీవీ రెడ్డి, సూర్యాపేట డీఎఫ్ఓగా వి. సతీష్ కుమార్ , సూర్యాపేట డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డి ఎక్సైజ్ శాఖలో డీసీఎఫ్ గా బదిలీ అయ్యారు. అరణ్య భవన్ లో డీసీఎఫ్ (ఐటీ) గా శ్రీలక్ష్మిని నియమించారు. 


అటవీ సంరక్షణ,  పునరుద్దరణలో తెలంగాణ టాప్ 


తెలంగాణ రాష్ట్రం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని... యూపీ అటవీ శాఖ మంత్రి కుడా తెలంగాణలోని పచ్చదనాన్ని చూసి అబ్బురపడ్డారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రులు, సీఎం లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ కితాబునిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్... హరిత హారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు  బాగున్నాయని అభినందించారని తెలిపారు. 


అమరవీరులకు మంత్రి నివాళి 


అడవులను, వణ్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమని మంత్రి అన్నారు. ఆదివారం అట‌వీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అమ‌రుల‌కు ఘనంగా నివాళి అర్పించారు. అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ ఆర్, ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్,  అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ లు పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర,  ఇతర అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్  పార్కు వ‌ద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు.


Also Read : TS Constable Cutoff Marks: కానిస్టేబుల్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గింపు: అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన


Also Read: TSPSC: శరవేగంగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 కసరత్తు, త్వరలోనే నోటిఫికేషన్లు!