తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించగా, అప్పటినుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తూనే ఉన్నది. ఐదు నెలల్లోనే 52,460 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా నియామక సంస్థలు ఇప్పటికే 19,359 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గత నెల 30న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖ ఆమోదించగానే నియామక ప్రక్రియను చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1,373 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 2న హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 100 మంది అధికారులు తమ శాఖల పరిధిలోని ఖాళీలు, సమస్యల గురించి తెలిపారు. సర్వీస్ రూల్స్, సవరణలు, క్లారిఫికేషన్లు, రోస్టర్ విధానం, ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు తదితర విషయాలన్నీ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వారికి వివరించారు. త్వరితగతిన గ్రూప్ 2,3 ఉద్యోగాలకు నోటిఫికేన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్‌లు సమర్పించాలని కోరారు.సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) ద్వారానే భర్తీచేయనున్నారు. ఇదే అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు పలుమార్లు పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 10,500 టీచర్ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించా రు. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఆర్థికశాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read:
TSPSC Recruitment: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
TSPSC Recruitment: నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్ - స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..