Taskforce Checkings In Secunderabad Alpha Hotel: ఇటీవల నగరంలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) సోదాలు చేసిన అధికారులు.. నాసిరకం ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండుతున్నట్లు గమనించారు. ఫుడ్ ముందుగానే తయారుచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చిన వేళ దాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీ ఫౌడర్ కూడా నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో అపరిశుభ్రంగా దారుణ పరిస్థితులు ఉన్నట్లు వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు హోటల్‌పై కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించారు. 






మరో హోటల్‌లోనూ..










అలాగే, సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్స్‌పైరీ అయిన నూడుల్స్ ప్యాకెట్, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు గుర్తించారు. అటు, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లోనూ సోదాలు చేశారు. కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలను చూసి అధికారులు షాకయ్యారు. కిచెన్‌లో దారుణ పరిస్థితులను చూసి బార్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అటు, మాదాపూర్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్ ఇలా కొన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లను సైతం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్లలో అపరిశుభ్ర పరిస్థితులను గమనించిన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: BRS MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ ఇంట్లో ఈడీ సోదాలు - గనుల వ్యవహారంలో నమోదైన కేసుపై!