Telangana Elections Renuka Chowdary: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ( Puvvada Ajay ) ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్‌లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. అధికార మదంతో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ( Congress ) కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తక్షణం వలస పోతావు పువ్వాడ అంటూ ఆమె హెచ్చరించారు.
నాగు పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుందని.. అలాగే పువ్వాడకి ఎంత చేసినా పాము లాగానే వ్యవహరిస్తారని విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మిలాఖత్ అయ్యాయని ఆమె ఆరోపించారు. ఐటీ దాడులు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. ఐటీ వాళ్ళు పిచ్చి వెదవలు అంటూ రేణుక.. ఇళ్లల్లో డబ్బులు పెట్టుకుని ఉంటామా అంటూ వ్యాఖ్యానించారు. పోలీసు కార్లలో డబ్బులు వెళ్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలలో మా కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే.. బీఆర్‌ఎస్ వాళ్ళ పవర్ కట్ అవుతోంది కదా అంటూ మాట్లాడారు. కేసీఆర్ నిజమే చెప్తున్నారని రేణుక చౌదరి అన్నారు.
ఖమ్మంలో చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మీ ఇంటికి వచ్చి సవాలు చేస్తానని.. నువ్వు ఓడిపోయిన తక్షణం అక్కడి నుండి పారిపోతావని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు. పువ్వాడ అజయ్ పాము కు పాలు పోస్తే కాటు వేసే రకమన్నారు. పువ్వాడ అజయ్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ముందుకు వస్తారని హెచ్చరించారు.
బీజేపీ , బీఆరెస్, మజ్లిస్ ఒకటే మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తానని.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు దాడులు చేస్తారని మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా.. బీఆరెస్ లో ఎంతమంది కోవర్ట్ లు ఉన్నారో మాకు తెలుసన్నారు. మాకు కోవర్ట్ లు ఉన్నారు..వారికి కూడా కోవర్ట్ లు ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాలు గెలుస్తామని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.