KTR On KCR Birthday Celebrations: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఈ నెల 15, 16, 17 తేదీలలో సంబరంగా జరుపుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 


కేసీఆర్ జన్మదినాన్ని (Telangana CM KCR Birthday) పురస్కరించుకుని ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల సంబరాలలో భాగస్వాములు కావాలని కేటీఆర్ అన్నారు. ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు: ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయాలి పిలుపునిచ్చారు.






ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17 తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం రోజున తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.


ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile) కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో సేవా కార్యక్రమాలను చేపట్టాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


Also Read: Love Marriage: సరిహద్దులు లేని ప్రేమ, అమెరికా అమ్మాయి తెలంగాణ అబ్బాయి అలా ఒకటయ్యారు


Also Read: KTR: హైదరాబాద్‌కు అన్ని వైపులా ఐటీ కంపెనీలు, తూర్పు వైపున లక్ష ఉద్యోగాలకు ఛాన్స్: కేటీఆర్