Kadiyam Vs Rajaiah : తెలంగాణలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి నుంచి ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలు అయ్యారు. ప్రస్తుతం ఒకరు ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఇద్దరు నేతల వార్ తో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పలచన పడుతుందినే టాక్ నడుస్తుంది. ఇదే అవకాశంగా భావించిన ఇతర పార్టీల నాయకులు బలపడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంతకీ స్టేషన్ ఘనపూర్ రాజకీయ చర్చ ఎంటీ? ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ల వార్ చివరకు ఎక్కడికి దారి తీస్తుందో? 


స్టేషన్ లో రాజకీయ వైరం 


జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరింది. మొదట నుంచి ఇక్కడ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది. గతంలో రాజయ్య కాంగ్రెస్ లో, కడియం టీడీపీలో ఉండగా.. వీరి మధ్య రాజకీయ వైరం మెదలైంది. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కూడా వీరి వైరం తగ్గడం లేదు. ఇద్దరు ఓకే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ పావులు కదుపుతుండడంతో వీరి విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరి తప్పును ఒకరు బహిరంగంగా భయటపెడుతుండడంతో   స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పలుచపడుతోంది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చింది. సీటు నాది అంటే నాది అని ప్రచారం చేసుకుంటున్నారు ఈ ఇద్దరు నేతలు. అదే సమయంలో ఇద్దరు నేతలు.. తమకు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటూ పోటా పోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. కడియం శ్రీహరి ఉన్న ఫ్లెక్సీలో రాజయ్య ఫొటో ఉండదు. రాజయ్య ఉన్న ఫ్లెక్సీలో కడియం శ్రీహరి ఫొటో ఉండదు. ఇలా ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీ వార్ కూడా నడుస్తుందనేది బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు.


ఒక్కరిపై ఒక్కరు పరోక్ష, ప్రత్యక్ష విమర్శలు


పరోక్షంగా, ప్రత్యక్షంగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు తరుచూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కడియం శ్రీహరి ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ.. ఎవరూ ఆత్మగౌరవం చంపుకోవద్దు, నా రాజకీయ జీవితంలో నేను ఎవరికీ పాదాభివందనం చేయలేదన్నారు. రాజకీయాల్లో నేను ఎవరికీ తరవంచలేదు,ఇకపై వంచబోను, ఆర్జించడం కాదు..నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలి, తప్పుచేసినోడే తలవంచుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే రాజయ్యపైనే పరోక్షంగా చేశారనే చర్చ నడుస్తుంది.


టికెట్ నాదే... గెలుపు నాదే


వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్ టికెట్ నాదే, గెలుపు నాదే అని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించుకున్నారు. రాష్ట్రం మొత్తంలో సీఎం కేసీఆర్ కు వీర వీధేయుడు కేవలం తాటికొండ రాజయ్య మాత్రమే అన్నారు. నా గెలుపును అడ్డుకునే వారు లేరన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారనే టాక్ వరంగల్ బీఆర్ఎస్ లో నడుస్తోంది.


టికెట్ కొత్త వారికి ఇవ్వాలి- ప్రజల మధ్య తీవ్ర చర్చ


ఈ వర్గ పోరు కంటే కొత్త వారికి సీటు ఇస్తే కనీసం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని స్థానికులు అంటున్నారు. వీరిలో ఎవ్వరికీ టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య ఆధిపత్య పోరును క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు అప్పుడే ఎత్తులకు  పైఎత్తులు వేస్తున్నాయి. టికెట్ రాని నేతను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. స్టేషన్  ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన ఇందిరాతో పాటు దోమ్మటి సాంబయ్య టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి విజయరామరావు టికెట్ రేసులో ఉన్నారు.


చెక్ పెట్టకుంటే ఇబ్బందే


మాజీ డిప్యూటీ సీఎంలు కడియం,రాజయ్యల మధ్య ఉన్న పోరుకు చెక్ పెట్టకపోతే రానున్నరోజులలో అధికార పార్టీ భారీ ముల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే ఆధిపత్య పోరు కంటిన్యూ అయితే స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ ఫ్యూచర్... కడియం, రాజయ్యల పొలిటికల్ ఫ్యూచర్ కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.