తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. జాబితాలో పేర్లు ఉండేందుకు కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సిరిసిల్ల జిల్లా ఓ కౌన్సిలర్ డబుల్ బెడ్ రూమ్ ఎంపికలో పేరు రావాలంటే డబ్బులు డిమాండ్ ఇవ్వాలని కోరారని ఓ మహిళ ఆరోపిస్తుంది. నగదు లేకపోతే పుస్తెలతాడు ఇచ్చేయ్ అన్నారన మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.  కౌన్సిలర్ అడిగిన డబ్బులు ఇవ్వనందుకే తన పేరు డబుల్ బెడ్ రూమ్ ఎంపిక జాబితాలో లేకుండా చేశారంటూ మహిళ ఆరోపించి మీడియా ఎదుట రోదించిన సంఘటన రాజన్న సిరిసిల్ల పట్టణం 25వ వార్డులో సోమవారం చోటుచేసుకుంది.



అసలేం జరిగిందంటే...


వివరాల్లోకి వెళితే సిరిసిల్ల పద్మానగర్ కు చెందిన నందగిరి మల్లిక అనే మహిళ దినసరి కూలీగా జీవనంసాగిస్తుంది. మంగళవారం సిరిసిల్ల 25 వార్డులో నిర్వహించిన వార్డు సభకు వచ్చిన ఆమె తనకు డబుల్ బెడ్ రూమ్ వస్తుందనే ఆశతో రాగా ఆమె పేరు జాబితాలో లేకపోవడంతో ఆవేదనం చెందారు. డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడానికి స్థానిక కౌన్సిలర్ అందరి వద్ద రూ.50 వేలు వసూలు చేశారని, ఇద్దరు అధికారులు కూడా డబ్బులు అడిగారని ఆరోపించింది. అయితే కాయకష్టం చేసుకునే తన వద్ద అంత డబ్బు లేదని అనడంతో మెడలో ఉన్న పుస్తెలతాడు ఇవ్వాలని అడిగారని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త బతికి ఉండగానే పుస్తెలతాడు ఎలా ఇవ్వాలని ఆమె వాపోయింది. తన భర్త దివ్యాంగుడని పనిచేయలేడని, తానే బీడీలు చుడుతూ, పలువురి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది. అధికారులు తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. 


Also Read: నిజంగా భద్రద్రి కొత్తగూడెంలో రాగి నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు?


'నా భర్తకు ఒక చెయ్యి లేదు. నేను ఇళ్లలో పనిచేసుకుంటూ నా భర్తను, పిల్లల్ని చూసుకుంటున్నారు. మా లాంటి పేదోళ్లకు ఏదో ఉపకారం చేస్తారని సీఎం కేసీఆర్ కు ఓట్లు వేశాం. ఆయనేదో మంచి పథకాలు పెడుతున్నారు. కానీ వాటిని మాకు అందనివ్వడంలేదు. మా లాంటి పేదోళ్ల దగ్గర కూడా లంచాలు అడిగితే ఎలా. మాకు న్యాయం చేయండి.' అని మల్లిక ఆవేదన చెందారు. 


Also Read: బలిదానాలకు బీజేపీదే బాధ్యత -మోదీ క్షమాపణలు చెప్పాలన్న రేవంత్ , హరీష్ రావు !