Rice Price In Telangana | తెలంగాణలో సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వరి సన్నాలకు సైతం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో తెలంగాణలో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఊహించిన దానికన్నా మార్కెట్లోకి సన్న బియ్యం ఎక్కువగా లభ్యం కావడంతో వీటి ధరలు దిగి వస్తున్నాయి. దేశంలోనే మర్యాదకంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ సైతం ఒకటి.
ఇతర రాష్ట్రాలకు సైతం సన్న బియ్యం ఎగుమతి..
తెలంగాణ నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి జరుగుతుంది. గతంలో ప్రీమియం రకం బియ్యం ధర కేజీ 60 నుంచి 70 వరకు ఉండే వి. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియానికి బోనస్ ప్రకటనతో భారీగా పంట దిగుబడితో ప్రస్తుతం ప్రీమియం రకం కేజీ 50-55కు లభ్యం అవుతున్నాయి. మొన్నటి వరకు కేజీ 55 నుంచి 60 రూపాయలు మధ్య ఉండే ఫైన్ రకం బియ్యం సైతం ప్రస్తుతం 43 నుంచి 48 మధ్య అందుబాటులోకి వచ్చాయి. హోల్సేల్ గా చూసుకుంటే సన్న బియ్యం కేజీకి రూ.10 నుంచి 15 రూపాయల వరకు ధర దిగి వచ్చింది. రిటైల్ గా చూసుకుంటే కేజీకి ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు మాత్రమే ధరలు తగ్గాయి.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల నుంచి సామాన్యుడికి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందన్న ప్రకటనతో మధ్యతరగతి పేద వర్గాల వారు గత కొన్ని రోజులుగా సన్న బియ్యం కొనుగోలు చేయడం లేదని రైస్ మిల్లర్ల సంఘం తెలిపింది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో ఉగాది పండుగ తర్వాత తెలంగాణలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ సైతం ఇస్తోంది. సన్నాలకు బోనస్ ప్రకటనతో రైతులు సన్న బియ్యం రకాలను భారీ గా పండించారు. మార్కెట్లో సన్న బియ్యం అధికంగా రావడం మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం సన్నాలనే రేషన్ దుకాణాల్లో ఇస్తామని ప్రకటించడంతో సన్న బియ్యం ధరలు తగ్గాయి. హెచ్ఎంటి, ఆర్ ఎన్ ఆర్ రకాలను రైస్ మిల్లు హోల్సేల్ కింద కే జి 45 రూపాయలకే విక్రయిస్తున్నారు. నాలకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటన అనంతరం గతంతో పోల్చితే కేజీ ₹10 నుంచి 15 వరకు తగ్గిందని బియ్యం ఎగుమతి దారులు చెబుతున్నారు.
కేంద్రం, రాష్ట్రం బోనస్‌తో కలిపి రూ.2,820
కేంద్ర ప్రభుత్వం ధాన్యం ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వరి సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుంది. మొత్తం కలిపితే క్వింటాలుకు రూ.2,820కి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సన్నాలకు బోనస్ ప్రకటనతో 2023 ఖరీఫ్‌తో పోలిస్తే 2024 ఖరీఫ్‌లో సన్నాల దిగుబడి దాదాపు 50 శాతం పెరిగింది. 2023-24 ఖరీఫ్‌లో 144.80 లక్షల టన్నుల ధాన్యం పండగా, 2024- 25 ఖరీఫ్ లో దిగుబడి 145.56 లక్షల టన్నులకు పెరిగింది. ఇందులో దొడ్డు ధాన్యం 57.17 లక్షల టన్నులు కాగా, సన్న ధాన్యం 88.39 లక్షల టన్నులు. మార్కెట్లోకి వరి సన్నాలు అధికంగా రావడంతో ఈ ఏడాది సన్న ధాన్యం ధర దిగొచ్చింది.