Ennallo Vechina Hrudayam Serial Today Episode: అన్ని అడ్డంకులు దాటుకుని అగ్నిగుండం మీదుగా నడిచి వెళ్తుంది. ఫణి సృష్టించే అడ్డంకులన్నీ బాలా తొలగిస్తూ...త్రిపురకు సహకరిస్తూ ఉంటాడు. ఎట్టకేలకు  అఖండ జ్యోతిని త్రిపుర వెలిగిస్తుంది. ఈలోగా బాలా కోసం కుటుంబ సభ్యులంతా ఆలయం చుట్టూ వెతుకుతుంటారు. ఈలోగా బాలా తిరిగి రావడంతోపాటు  త్రిపుర అఖండ జ్యోతిని వెలిగించిన ఘట్టాన్ని వివరిస్తాడు. ఈలోగా బాలాను మరింత ఇబ్బంది పెట్టేందుకు ఫణి,వాళ్ల అమ్మ వాళ్లు మరో దుష్టపన్నాగం పన్నుతారు. ఓ పెట్టె నిండా సీతాకోక చిలుకలను తీసుకొచ్చి అక్కడ వదులుతారు. అవన్నీ బాలా వైపు వస్తుండటంతో అక్కడే ఉన్న త్రిపుర వెంటనే బాలా వద్దకు వెళ్లి తన చీర కొంగుతో అతని తలను మూసివేస్తుంది. ఈ సీతాకోక చిలుకలు అతని కంటికి కనిపించకుండా  జాగ్రత్తపడుతుంది. ఈలోగా  సీతాకోక చిలుకలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అప్పుడు బాలా వారికి సుందరిని పరిచయం చేస్తాడు.ఇదంతా విన్న ఫణివాళ్ల బృందం ఇన్నాళ్లు మన ప్లాన్లు అన్నీ చెడగొడుతోంది  త్రిపురనే అని తెలుసుకుంటారు. సీక్రెట్ కెమెరా కూడా  తన వద్దే ఉందని ఫణి వాళ్లకు చెబుతాడు. ఈలోగా త్రిపుర తాతయ్య ఆమెను పిలవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంంది.   

                        బాలా మెడలో గొలుసుకు ఉన్న ఉంగరాన్ని చూసి బామ్మ ఆ ఉంగరం ఎవరిదని అడుగుతుంది.అప్పుడు బాలా ఆ ఉంగరం సుందరిదని...తన గుర్తుగా నా వద్దే ఉంచుకోమని ఇచ్చిందంటాడు. సుందరి ఉంటే తనకు ఆనందంగా ఉంటుందని చెబుతాడు.ఇంట్లో వాళ్లుకూడా  త్రిపుర చెప్పినట్లే బాలా వింటున్నాడని...ఆమె దగ్గర ఉంటే వీడికి కొంత ఊరటగా ఉంటుందని అనుకుంటారు. గుడిలో సీతాకోక చిలుకల నుంచి కూడా ఆమె బాలాను కాపాడిందని అనుకుంటారు. ఈలోగా బామ్మ ఆ అమ్మాయినే బాలాకు కేర్‌టేకర్‌గా పెడితే బాగుంటుందని  సలహా ఇస్తుంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  బాలాను చాలాసార్లు త్రిపుర కాపాడిందని గుర్తు చేస్తుంది. ఆమె పక్కన ఉంటే బాలాలో మార్పు వస్తుందని అంటుంది. ఆమెనే కేర్‌టేకర్‌గా పెట్టుకోవాలని వాళ్లంతా అనుకోవడం విని ఫణివాళ్ల బృందానికి గుండెల్లో దడ మొదలవుతుంది.  ఈ సీక్రెట్ కెమెరాలో తమ గుట్టంతా దాగి ఉందని భయపడతారు. ఈలోగా త్రిపుర ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా చైల్డ్‌ వేల్ఫేర్‌ ఆఫీసుకు  ఇంటర్వూకి హాజరవుతుంది. కానీ వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా  ఆర్గాన్స్‌ మాయం చేసే ముఠా అని తెలియక వారి వద్ద ఉద్యోగం కోసం త్రిఫుర వెళ్తుంది. కాలనీల్లో ఉండే పేదపిల్లలకు చదువు చెప్పేందుకు నువ్వు ఆ కాలనీల్లోకి వెళ్లి పిల్లలను తీసుకురావాలని చెబుతారు. నెలకు లక్షరూపాయలు ఇస్తామని చెప్పడంతో త్రిపుర సరేనని చెబుతుంది. ప్రతిరోజూ ఐదారుగురు పిల్లలను తీసుకురావాలని చెబుతారు. 

               త్రిపురను వెతుక్కుంటూ బాలా కుటుంబం ఆమె ఇంటికి వస్తుంది.అక్కడ ఊర్వశి వాళ్ల అమ్మను  చూసిన బామ్మగారు నువ్వు ఇక్కడ ఉన్నావేంటని అడగగా...తామ ఇళ్లు ఇదేనని చెబుతుంది. త్రిపుర గురించి అడగ్గా...తాను మా బావగారి కుమార్తెనని  ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఈలోగా ఊర్వశిని పరిచయం చేయడానికి వాళ్ల అమ్మ నానా తిప్పలుపడుతుంది. తాము రామగిరిలో ఉన్నప్పుడు బాలాకు త్రిపుర చేసిన సాయాన్ని వాళ్ల తాతయ్యకు బాలా తల్లి వివరిస్తుంది. మొన్న గుడిలోనూ  అతన్ని కాపాడిందని చెబుతారు. కాబట్టి మా బాలాకు కేర్‌టేకర్‌గా  త్రిపుర ఉంటుందేమోనని అడగడానికి వచ్చామని చెబుతారు.అప్పుడే అక్కడ ఉద్యోగం కోసం వెళ్లిన త్రిపుర బాండ్‌ పేపర్లపై సంతకం పెడుతుండగా...ఆ చైల్డ్‌ వేల్ఫేర్ సంస్థపై పోలీసులు రైడ్‌చేయడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.