తెలంగాణలో జీవో నెం.317కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు అరెస్టులకు దారి తీస్తున్నాయి. శనివారం రోజు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు పలువురు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీచర్లను అరెస్ట్ చేయడంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు ప్రజలకు అత్యంత సంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి నాడు వారితో చర్చలు జరపకుండా అరెస్టులు చెయ్యడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత‌్వాన్ని డిమాండ్ చేశారు.  


Also Read: మన జీవితానికి పండగ లేదు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులు


ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయ నాయకులను వెంటనే విడుదల చేయాలని...ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగ బద్దంగా ప్రగతి భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీచర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర చాలా కీలకమైంది.. ఉద్యమంలో వారి పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల, ఉద్యోగులకు హక్కులకు భంగం కలిగించే 317 జిఓ వెంటనే రద్దు చేయాలన్నారు. 


Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?


ఉపాధ్యాయుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. 317 జిఓ రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు మద్దతుగా పోరాడుతుందని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు కోసం ఇచ్చిన జీవో నెం. 317 వల్ల అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టీచర్లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు.. మరికొందరు దిగులుతో గుండెపోటుకు గురై మరణించారు. 


Also Read: ఆ బదిలీల జీవో వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ! నిజామాబాద్ జిల్లాలో రోడ్డున పడ్డ పంచాయతీ కార్యదర్శలు...


ఇప్పుడు 317 జీవో అంశం రాజకీయం అయింది. ఒక్క టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా ఉంది. జీవోను అమలు చేయడంపైనే దృష్టి పెట్టింది. ఈ కారణంగా  ఉద్యమం పెరిగి పెద్దదవుతోంది. 


Also Read: టీచర్లకు బదిలీలు తెచ్చిన కొత్త చిక్కు... వేర్వేరు జిల్లాలకు భార్యభర్తల బదిలీలు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 


 


 


ఇప్పుడు 317 జీవో అంశం రాజకీయం అయింది. ఒక్క టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా ఉంది. జీవోను అమలు చేయడంపైనే దృష్టి పెట్టింది. ఈ కారణంగా  ఉద్యమం పెరిగి పెద్దదవుతోంది.