తెలంగాణలో జీవో 317తో కొత్త చిక్కులు వచ్చాయంటున్నారు టీచర్లు. బదిలీలు సంగతేమో గానీ ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయులుగా పని చేస్తున్న భార్య భర్తలు వేరువేరు జిల్లాలకు బదిలీ అవ్వడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇలా భార్యభర్తలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయిన వారంతా కలిసి "కరీంనగర్ జిల్లా స్పైస్ ఇన్కమింగ్ గ్రూప్" అనే ఒక ఫోరమ్ గా ఏర్పాడ్డారు. సమస్య నెరవేరేవరకు శాంతియుతంగా పోరాడుతామని ఈ ఫోరమ్ సభ్యులు అంటున్నారు. సీఎం కూడా తమ సమస్యను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.
Also Read: నకిలీ కాల్ సెంటర్ తో రూ.50 కోట్ల మోసం... క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు
అసలేంటి సమస్య ?
రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు జరుగుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది కానీ మొత్తం 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాలకు మాత్రమే.. టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఇరువురిని ఒకే జిల్లాకు వేశారు. కానీ మిగతా 13 జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డిలకు చెందిన భార్య భర్తలైన టీచర్లు వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. దీంతో తమ కుటుంబాలు చెల్లాచెదురు అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినతి పత్రం ఇవ్వడానికే
భర్త ఒక చోట పని చేస్తే భార్య... అక్కడి నుంచి 100-300 కిలోమీటర్ల దూరంలోని మరో పాఠశాలలో పని చేయాల్సి వస్తుందని, దీంతో తమపై ఆధారపడ్డ వృద్ధులైన తల్లిదండ్రులు, తమ పిల్లలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. మరోవైపు దూరం వల్ల తమకు శారీరక మానసిక సమస్యలు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సీఎం మిగతా 13 జిల్లాలను కూడా బ్లాక్ లిస్టు నుంచి తొలగించాలని టీచర్లు కోరుతున్నారు. కేవలం వినతిపత్రం ఇవ్వడానికి హైదరాబాద్ కి వెళ్లామే తప్ప 317జీవోకి వ్యతిరేకంగా కాదని వారు స్పష్టం చేశారు.
Also Read: మాదాపూర్‌లో నడి రోడ్డుపైనే డబ్బు కట్టలు.. అన్నీ 2 వేల నోట్లే.. ఎగబడి తీసుకున్న జనం, అంతలోనే ఉసూరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి