అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సైదరాబాద్ పోలీసులు. నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో కీలక సూత్రధారి నవీన్ బొటాని కీలక సూత్రధారి విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులు సప్లై చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ ద్వారా క్రెడిట్ కార్డులు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర గుర్తించారు.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల అమ్మకాలు చేస్తూ మోసాలు
నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మొహాలీ, హైదరాబాద్‌కు చెందిన 7గురిని అరెస్టు చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.1.11 కోట్లు, వివిధ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ ముఠా 80 మందితో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల అమ్మకాలు చేస్తుందని సీపీ తెలిపారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈ ముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారి అని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Also Read: మాదాపూర్‌లో నడి రోడ్డుపైనే డబ్బు కట్టలు.. అన్నీ 2 వేల నోట్లే.. ఎగబడి తీసుకున్న జనం, అంతలోనే ఉసూరు
80 మందితో కాల్ సెంటర్
నవీన్ 2017లో ఆర్‌ఎన్ టెక్ సర్వీసెస్ అని ఒక కంపెనీని పెట్టాడు. ఈ కంపెనీలో 80 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. దిల్లీ, మొహాలీ, ఘజియాబాద్‌లో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్ కార్డులున్న వారి సమాచారం సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. విదేశీ క్రెడిట్ కార్డుల కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు కాల్ సెంటర్ ద్వారా టోకరా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా రూ.50 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారు. దుబాయ్‌లో మరో 2 ముఠాలు ఉన్నట్లుగా సైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?