Praja Palana Website: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ prajapalana.telangaana.gov.in ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 (కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83) దరఖాస్తులు వచ్చాయి. గ్యారంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దారఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం (జనవరి 8న) డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలన పై తయారుచేసిన వెబ్ సైట్ https://prajapalana.telangana.gov.in/ లాంచ్ చేయనున్నారు.
ప్రజాపాలనలో భారీగా వచ్చిన దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 (కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83) దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర abhyardanalaku సంబంధించి 19 ,92 ,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16 , 392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1 ,11 ,46 ,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3 ,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ ఎంసీ లోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17 వ తేదీ లోగా డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య (లక్షల్లో )
- హైదరాబాద్ : 13 .7
- రంగారెడ్డి : 10 . 2
- మేడ్చల్ మల్కాజిగిరి : 9 .2
- నల్గొండ : 6 .1
- నిజామాబాద్ : 5 .9
- ఖమ్మం : 5 .5 .
- సంగారెడ్డి : 4 .4
సిద్ధిపేట : 3 .8
- సూర్యాపేట : 4 .2
- జగిత్యాల : 3 .9
- భద్రాద్రి కొత్తగూడెం : 3 .7
- కరీం నగర్ : 3 .5 .
- వరంగల్ : 3 .3
- మహబూబ్ నగర్ : 3 .2
- వికారాబాద్ : 3 .1
- మహబూబాబాద్ : 3 .1
- కామారెడ్డి : 3 .1
- హనుమకొండ: 2 .93
- మంచిర్యాల : 2 .83
- నిర్మల్ : 2 .80
- మెదక్ : 2 .73
- పెద్దపల్లి : 2 .69
- యాదాద్రి బోనగిరి : 2 .54
- ఆసిఫాబాద్ : 2 .20
- రాజన్న సిరిసిల్ల : 2 .15
- నారాయణ పెట్ :2 .09
- నాగర్ కర్నూల్ : 2 .03
- జోగులాంబ గద్వాల్ :1 .95
- కొమురంభీం ఆసిఫాబాద్ : 1 .82
- జయశంకర్ భూపాల్ పల్లి : 1 .46
- ములుగు : 1 .10