తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిపోయిన వారిని మళ్లీ సొంత గూటికి రప్పించేలా ఆయన చర్చలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. నిజానికి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దూకుడుగా విమర్శలు చేశారు. వారిని రాళ్లతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారిపై అనర్హతా వేటు వేయించడానికి న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తామని దమ్ముంటే రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు. తీవ్రమైన ప్రకటనలతో వారిపై ఒత్తిడి పెంచి ఇప్పుడు.. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని ప్రతిపాదనలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read : ఏకు మేకయ్యానని నన్ను ఖతం చేయాలని కుట్ర పన్నుతున్నరు.. ఈటల సంచలనం


టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది.  కాంగ్రెస్‌కు భవిష్యత్‌కు లేదని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నమ్మారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి ఆఫర్ రావడంతో ఒప్పేసుకున్నారు. టీఆర్ఎస్ చేరుతామంటే ఆపే వారు కూడా లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా వెళ్లి చేరిపోయారు. చివరికి విలీనం చేసేశారు. మొత్తంగా కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్​ఎస్​లో 12 మంది ఎమ్మెల్యేలు చేరారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదు.  ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అందుకే అలాంటి వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌లోకి లాగాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. 


Also Read : కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


ఇటీవల పార్టీ మారిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశం అయినట్లుగా టీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన చోట టీఆర్ఎస్‌కు బలమైన నేతలు ఉన్నారు, టీఆర్ఎస్ క్యాడర్ వారి వెంటే ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో నడవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పార్టీ పరమైన పదవులు కూడా తమవారికి ఇప్పించుకోలేకపోతున్నారు వలస ఎమ్మెల్యేలు. కొంత మంది పనితీరు నాసిరకంగా ఉండటంతో అలాంటి వారిని టీఆఎస్ హైకమాండే దూరం పెడుతోంది. దీంతో వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. 


Also Read : మన సరిహద్దులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా... అనారోగ్యమా? అగ్ర నేత మృతిపై ఆరా తీసేందుకా...?


టీఆర్ఎస్ పార్టీలో వెల్లువలా జరిగిన చేరికలతో ఆ పార్టీలో నేతలు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి టిక్కెట్ల కోసం పోటీపడేవారు ముగ్గురు, నలుగురు ఉంటున్నారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే  టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉండి   ప్రజాబలం ఉన్న నేతల్ని గుర్తించి కండువా కప్పేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణను చేర్చుకున్నారు. సీనియర్లు అయిన డీఎస్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Also Read : గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి