Musi rejuvenation padayatra:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి నాగిరెడ్డి పల్లి వరకూ యాత్ర సాగింది. యాత్రను ప్రారంభించడానికి ముందు మూసీ నదిలోని నీటిని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయన స్వయంగా ఓ బాటిల్‌తో మూసీ నీటిని  పట్టుకున్నారు. తర్వాత బోటులో వెల్లి మూసి కాలుష్యాన్ని పరిశీలించారు. 


సంగెం వద్ద శివలింగానికి రేవంత్ ప్రత్యేక పూజలు               


సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డి మూసీ పునరుద్ధరణ యాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హాజరయ్యారు.  సీఎం పాదయాత్రకు మూసీ బాధిత రైతులు భారీగా తరలివచ్చారు. మూసీ కాలుష్యంపై రైతులు, మత్స్యకారులతో సీఎం మాట్లాడారు. కాలుష్యం కారణంగా వాళ్లకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు గురించి వాళ్లకు వివరించారు.          


యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం


మూసి నీళ్లను బాటిల్‌తో పట్టుకుని పరిశీలించిన రేవంత్ రెడ్డి                 


మూసీ నది కాలుష్యంపై గత కాలంలో అనేక పరిశోధనలు నిర్వహించబడ్డాయి. ఆ పరిశోధనల ప్రకారం, మూసీ నది కాలుష్యం నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలకు మహా ప్రమాదాన్ని కలిగించుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పెద్ద కష్టాన్ని తీసుకువస్తుందని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ నది పునరుజ్జీవనానికి మిన్న కృషి చేయాలని సంకల్పించారు. అందుకోసం, మూసీ నది సుందరీకరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా, మూసీ నది కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై కూడా పర్యవేక్షణ చేపట్టారు. మూసీ నది వద్ద అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించడం మొదలైంది.  



Also Read: HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్




 ఈ నిర్ణయాలు ప్రతిపక్షాల విమర్శలకు గురయ్యాయి. నది ప్రక్షాళన  విషయంలో ప్రజల భద్రత , పేదల నష్టం నివారించాల్సిన అవసరం ఉందని ఆరోపిస్తూ, ప్రతిపక్షాలు సీఎం నిర్ణయాలను ప్రశ్నించాయి. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. “మూసీ నది వెంట కొన్ని రోజులు గడపడానికి ప్రతిపక్షాల నాయకులు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. “మూసీ నది కాలుష్యాన్ని తగిన దృఢమైన చర్యలతో నివారించడం కోసం నేను ఇప్పటి నుండీ కృషి చేస్తున్నాను. కానీ, విమర్శలు చేస్తున్నవారికి, కనీసం రెండు రోజులు అయినా నది ఒడ్డున ఉండాలని నేను పిలుపునివ్వగలుగుతున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.