Dharmavaram Former MLA has captured the pond: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును కబ్జా చేశారని ప్రభుత్వం గుర్తించింది. యువగళం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్ లపై సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేష్.  తాము అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్మార్నింగ్ ధర్మవరం పేరుతో సోషల్ మీడియాలో రోజూ ఉదయం లైవ్‌లు పెడుతూంటారు. అందుకే ఆయనకు గుడ్మార్నింగ్ స్టార్ అనే  పేరు ఇచ్చారు 


గెస్ట్ హౌస్ నుంచి బోటింగ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు


అప్పట్లో ఓ చెరువు పక్కన కట్టిన ఇల్లు, గుర్రాల రేస్ ట్రాక్..ఇలా సర్వ హంగులతో కట్టిన ఇంటిని డ్రోన్ ద్వారా చిత్రీకరించి నారా లోకేష్ బయట పెట్టారు. ఇప్పుడు ఆ చెరువు ఇంటికి అధికారులు నోటీసులు జారీ చేశారు.  వారం రోజుల్లోపు చెరువుల ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి నోటీసులను ధర్మవరం తాసిల్దార్ పంపించారు. ఆ చెరువుల్లో కబ్జా చేసిన భూములను ఆమె పేరు మీదనే రిజిస్టర్ చేశారు. 


వారం రోజుల్లో చెరువు కబ్జాలను తొలగించాలని ఆదేశం 


ప్రభుత్వ భూములతో కలిసి చెరువును సైతం కబ్జా చేసినట్లు దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన ధర్మవరం తహసిల్దార్ గుర్తించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోనే సర్వేనెంబర్ 904, 905, 908,908 సర్వే నంబర్లు పరిధిలోనే రైతుల నుంచి 25 ఎకరాలు గాలి వసుమతి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లోకి  ఎక్కించారు.  ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఉన్న 908,909,910,616-1 సర్వే నంబర్లు పరిధిలోనే దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించారని గుర్తించారు  కొన్నది 20 ఎకరాలు... ఆక్రమించుకున్నది 20 ఎకరాలు కలిపి 45 ఎకరాల లో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్ గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. 


తన తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు.   ఇవే కాకుండా ధర్మవరం మండల పరిధిలోనే మల్లా కాల్వ గ్రామంలో సైతం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆక్రమించిన భూములపై పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.  


కార్తీక మాసం సందర్భంగా అందుబాటులో లేనన్న కేతిరెడ్డి 


అయితే ధర్మవరం భూములపై సోషల్ మీడియా ద్వారా  మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి వెంకటరామిరెడ్డి స్పంగింతాపు,  గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారం ఆ భూములు అన్ని కూడా నిబంధన ప్రకారమే ఉన్నాయన్నారు.  అప్పటి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు సర్వేలు చేసి అన్ని రికార్డులు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు  కోర్టులో ఉన్న భూములపై ప్రస్తుతమున్న అధికారులు కూటమి ప్రభుత్వం నోటీసులు ఎలా జారీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. వీటన్నిటి పైన మరొకసారి కోర్టును ఆశ్రయిస్తానని..  కార్తీక మాసం సందర్భంగా ప్రస్తుతం అందుబాటులో లేనని.. ధర్మవరం వచ్చిన తర్వాత అన్ని ఆధారాలతో పత్రాలతో వెల్లడిస్తానని వీడియోలో తెలిపారు.